Advertisement
కార్తీక మాసం.. శివకేశవులకు అత్యంత ఇష్టమైన మాసం. హిందువులకు అత్యంత పవిత్రమైన నెల ఈ కార్తీకమాసం. తులసి పూజలు, వనభోజనాలు, సమారదాలు, ఉపవాసములు, అభిషేకాలు, సహస్రనామ పారాయణాలతో మార్మోగుతూ ఎంతటి నాస్తికుడైన ఆస్థికభావనలు కలుగజేసే మాసమిది. అయితే ఈ మాసంలో మనం ఎక్కువగా ఇంటి నిర్మాణాలు చేపట్టడం, లేదా ఇల్లు కొనుగోలు చేయడం వంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇందుకు గల కారణం..
Advertisement
Read also: కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే..జరుగబోయేవి ఇవే !
ఇంతటి పవిత్రమైన మాసంలో ఇంటి నిర్మాణం చేపడితే ధనధాన్యాలకు ఏమాత్రం కొదవ ఉండదని పంచాంగ నిపుణులు అంటున్నారు. చాలామంది ఈ కార్తీకమాసంలోనే ఇళ్ళ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఇళ్ల నిర్మాణాన్ని కార్తీక మాసంలోనే ఎందుకు ప్రారంభిస్తారు? దీనికి బలమైన కారణం ఏంటి? పలు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కార్తీకమాసంలో ఇంటి నిర్మాణం చేపడితే ధనధాన్యాలకు ఏమాత్రం కొదవ ఉండదని పంచాంగ నిపుణులు అంటున్నారు. అలాగే ఈ మాసంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టడం, లేదా ఇంటి స్థలం కొనడం వంటివి చేస్తే వారికి సకల సంపదలు కలుగుతాయని పంచాంగ నిపుణులు భావిస్తారు. అందుకే కార్తీక మాసంలో కొత్తగా ఇళ్ల నిర్మాణాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మాసంలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులను ఆరంభిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్మాణం పూర్తి చేస్తారు.
Advertisement
ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా నివాసం ఉంటారని పంచాంగం నిపుణులు అంటున్నారు. ఇదే కాక మరొక ముఖ్య కారణం కూడా ఉండేది. సరిగ్గా కార్తీకమాసంలోనే పంట చేతికి వస్తుంది. దీంతో ఈ మాసంలో డబ్బులు కూడా సమృద్ధిగా ఉండేవి. ఆ సమయంలో వచ్చిన పంట డబ్బులతో ఇంటి నిర్మాణం చేపడితే త్వరగా పూర్తి అయ్యేది. కాబట్టి కార్తీక మాసంలోనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే వారు. అందుచేత కార్తీక మాసంలో ఇల్లు కొనేందుకు అయినా, లేదా కొత్తగా నిర్మాణం చేపట్టేందుకైనా ప్రయత్నాలు ప్రారంభించడం ద్వారా ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.