Advertisement
ఇండియాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. వారి కోరిన కోరికలు నెరవేరితే జుట్టు సమర్పిస్తారు. అందుకే తిరుపతి వెళ్లిన వారు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించి రావడం వారి యొక్క నమ్మకం. మరి ఈ విధంగా ఇచ్చిన వెంట్రుకలను తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేస్తుంది. దానిపై వారికి ఏమైనా ఆదాయం వస్తుందా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
Advertisement
2018 లెక్కల ప్రకారం చూసుకుంటే 5600 కేజీల తల వెంట్రుకలపై టీటీడీకి ఏడు కోట్ల మేరకు ఆదాయం వచ్చిందట. భక్తులు సమర్పించిన తల వెంట్రుకలను వాటి పొడవును బట్టి మూడు కేటగిరీలుగా విభజిస్తారట. గ్రేడ్ 1 లో 31 ఇంచుల కంటే ఎక్కువ పొడుగు ఉంటే గ్రేడ్ 1 కింద లెక్కిస్తారట. 1600 కేజీల గ్రేడ్ వన్ తల వెంట్రుకలను వేలం వేస్తే 3.56 కోట్ల రూపాయలు వచ్చాయని తెలుస్తోంది. గ్రేడ్ 2 తల వెంట్రుకలు 16-30 ఇంచుల మధ్య ఉంటాయట. 2000 కేజీల గ్రేడ్ 2 తల వెంట్రుకలకు దాదాపు 3.44 కోట్ల రూపాయలు వచ్చాయట.
Advertisement
also read: Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 14.11.2022
గ్రేడ్ 3 పది నుంచి పదిహేను ఇంచుల పొడవు ఉండే వెంట్రుకలను గ్రేడ్ 3గా పరిగణిస్తారు. 3000 కేజీల గ్రేడ్ 3 వెంట్రుకలపై 24.11 లక్షల రూపాయలు వచ్చాయని తెలుస్తోంది.
ఇక తెల్ల వెంట్రుకలను కూడా వేలంలో మంచి రేటు పలుకుతుందట. 1200 కేజీల తెల్ల వెంట్రుకలపై 66.55లక్షల రూపాయలు వస్తాయని తెలుస్తోంది.
also read:కార్తీక మాసంలోనే ఇంటి నిర్మాణాలు ఎక్కువగా ఎందుకు జరుపుతారో తెలుసా?