Advertisement
ఏమీ లేకపోయినా ప్రగల్భాలు పలికేవారి గురించి చెప్పే సందర్భంలో ఇలాంటి సామెత వాడతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఇది కరెక్ట్ గా సూటవుతుంది. పార్టీలో ఎన్ని తగువులు ఉన్నా.. నియోజకవర్గంలో సొంతవాళ్లే తలనొప్పిగా తయారైనా.. గొప్పలు చెప్పుకోవడంలో ముందుంటారు. తమకి ఎదురులేదని.. తమ పార్టీకి తిరుగులేదని మీడియా ముందు తెగ మాట్లాడుతుంటారు. అలాంటి వారిలో మంత్రి రోజా కూడా ఒకరనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
Advertisement
సీఎం జగన్ ని, వైసీపీని ప్రతిపక్షాలు చిన్న మాటన్నా చాలు వెంటనే మీడియా ముందుకొచ్చే లీడర్లలో రోజా ఒకరు. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి రెడీగా ఉంటారు. ఇతర పార్టీల నేతల్ని మీడియా ముందు చెడామడా తిట్టేయడంలో రోజా చూపే ఆసక్తి.. సొంత పార్టీ నేతలు, క్యాడర్ ని కలుపుకొని పోవడంలో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరి నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు గెలిచారు రోజా. ఇటీవలే మంత్రి అయ్యారు. కానీ.. నియోజకవర్గంలో ఆమెకు వ్యతిరేకంగా మరో వర్గం ఎదుగుతూ వస్తోంది. ఇదే ఆమెకు తలనొప్పిగా తయారైంది. ఎప్పుడూ ఏదోఒక అలజడి రేగుతూనే ఉంది.
Advertisement
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నగరి వైసీపీలో వివాదాలు ప్రారంభమై.. నేటికి సెగలు రేపుతూనే ఉన్నాయి. సందర్భం ఏదైనా రోజా వర్సెస్ వైసీపీలోని వ్యతిరేక వర్గంగా మారిపోయింది. అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినా సమస్య కొలిక్కి రాలేదు. రోజా మంత్రి అయ్యాక మార్పు వస్తుందని అనుకున్నా వివాదాలు ఎక్కువ అవుతున్నాయనే గానీ పరిస్థితిలో మార్పులేదు. అసమ్మతి వర్గం కొత్త ఎత్తుగడలతో మంత్రి శిబిరాన్ని హడలెత్తిస్తోంది. తాజాగా పడమాలపేట మండలం పత్తిపుత్తూరు సచివాలయాన్ని ప్రారంభించేందుకు రోజా వెళ్లారు. స్థానిక జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ఆమె పర్యటనను అడ్డుకున్నారు.
ఒకే ప్రాంగణంలో సచివాలయం, ఆర్బీకే, పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించామని.. రూ.34 లక్షలు వెచ్చించగా ఇంకా రూ.23 లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇదే సమయంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయడం ఏంటని ఆయన మంత్రి పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాకే భవనాలను ప్రారంభించాలని తాళాలు వేశారు. అయితే.. రోజా అనుచరులు ఊరుకోలేదు. బలవంతంగా తాళాలు పగలగొట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఇంత జరిగినా.. రోజా సచివాలయాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇలా చాలా పంచాయితీలే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం క్వారీల విషయంలో రగడ కొనసాగింది. తరచూ ఏదో ఒక గొడవ తెరపైకి వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు, క్యాడర్ తో రోజాకు సత్సంబంధాలు తెగిపోయాయనే ప్రచారం సాగుతోంది. మిగిలిన పార్టీల నేతలపై నోరేసుకుని పడిపోవడం కాదు ముందు నియోజకవర్గంలో పార్టీని చక్కదిద్దుకో అంటూ ప్రతిపక్షాలు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.