Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తన కుటుంబ సభ్యులు ఇద్దరిని కోల్పోయిన మహేష్ బాబుకు మరో ఊహించని షాక్ తగిలింది. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కు గుండెపోటు వచ్చింది. దీంతో సూపర్ స్టార్ కృష్ణను అర్థరాత్రి హైదరాబాద్ నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఇక తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యుడు ఎన్.రెడ్డి కీలక ప్రకటన చేశారు.
Advertisement
సూపర్ స్టార్ కృష్ణ కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యుడు ఎన్.రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉన్నాడని వైద్యులు తెలిపారు. సోమవారం నాడు మధ్యాహ్నం కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు. సోమవారం నాడు తెల్లవారుజామున 2 గంటలకు హీరో కృష్ణను ఆసుపత్రికి తీసుకువచ్చినట్టుగా చెప్పారు.
Advertisement
ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు. 24 గంటల వరకు ఏమీ చెప్పలేమని డాక్టర్ రెడ్డి చెప్పారు. హీరో కృష్ణకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నట్టుగా ఆయన వివరించారు. కార్డియాలజిస్టుల వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టుగా డాక్టర్ రెడ్డి తెలిపారు. కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని డాక్టర్ రెడ్డి తెలిపారు.
READ ALSO : పెళ్లికి ముందే రిలేషన్‌షిప్‌లోకి రావటానికి కారణాలు !
కృష్ణకు కార్డియాక్ అరెస్ట్.. 24గంటల తర్వాత ఆరోగ్యంపై ప్రకటన చేస్తాం – కాంటినెంటల్ ఎండీ గురు.ఎన్.రెడ్డి
FULL VIDEO – https://t.co/N8w4ORGlDJ#SuperStarKrishna #Krishna #Tollywood #cardiacarrest #MaheshBabu #Superstar #NTVTelugu pic.twitter.com/gTyTwil6La
— NTV Telugu (@NtvTeluguLive) November 14, 2022