Advertisement
నల్గొండ జిల్లాలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు వరంలా మారారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును భరిస్తూ వారి ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్నారు. ఎవరూ చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మొన్న యూట్యూబ్ లో వీడియోలు చూసి ఎంబీబీస్ ర్యాంక్ సాధించిన హారిక చదువుకు అయ్యే ఖర్చు అంతా భరిస్తానని చెప్పిన ఆయన.. తాజాగా ఇద్దరు విద్యార్థులకు అండగా నిలబడ్డారు.
Advertisement
నల్గొండలోని ఓల్డ్ సిటీ మధురానగర్ లో ఊటకూరు బుక్కయ్య కుటుంబం నివసిస్తోంది. ఈయనకు శ్రీలక్ష్మి అనే కుమార్తె ఉంది. ఈమధ్యే నీట్ ని క్రాక్ చేసిఎంబీబీఎస్ లో సీట్ సాధించింది. కానీ, ఆర్థిక ఇబ్బందులతో ఈ కుటుంబం సతమతమౌతోంది. పేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదవడం అంటే మామూలు విషయం కాదు. అందుకే నేనున్నానంటూ ముందుకొచ్చారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శ్రీలక్ష్మి చదువుకు అయ్యే ఖర్చు అంతా భరిస్తానని హామీ ఇచ్చారు.
Advertisement
కోమటిరెడ్డి చేసిన సాయంపై శ్రీలక్ష్మి, బుక్కయ్య మాట్లాడుతూ.. ఆయన తమకు దేవుడిలా కనిపిస్తున్నారని అన్నారు. తమ కుటుంబం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుందని తెలిపారు. ఎంపీ గారు తమతోపాటు ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని వివరించారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని శ్రీలక్ష్మి తెలిపింది. కోమటిరెడ్డిగారి సాయం మరువలేనిదని.. తన కుమార్తెలా ఇంకా చాలామంది విద్యార్థుల ఎదుగుదలకు ఆయన తోడ్పాటు అందించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు బుక్కయ్య.
సూర్యాపేట జిల్లా నాగారం గ్రామానికి చెందిన చిప్పలపల్లి మౌనికది ఇదే పరిస్థితి. ఖమ్మంలో ఇంటర్ పూర్తి చేసింది. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి 81 శాతం మార్కులు సాధించింది. పుదుచ్చేరి సివిల్ ఇంజనీర్ బ్రాంచ్ లో సీట్ సంపాదించింది. కానీ, ఆర్థిక కష్టాలతో డ్రాప్ అవుదామని భావించింది. ఈ విషయం తెలిసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చలించిపోయారు. ఇలా మెరిట్ స్టూడెంట్స్ మధ్యలోనే డ్రాప్ అవ్వకూడని సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
మొత్తం 7 లక్షల వరకు తన చదువుకు అయ్యే ఖర్చు అంతా ఎంపీ గారు భరిస్తానని చెప్పారని మౌనిక తెలిపింది. ఆయన చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది. తనలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు సాయం చేసి ప్రోత్సహిస్తున్న కోమటిరెడ్డిది ఎంతో గొప్ప మనసు అని తెలిపింది మౌనిక.