Advertisement
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు అనేవి పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ ద్వారా ప్రేమించుకోవడం వారి గురించి పూర్తిగా తెలియక ముందే శారీరకంగా కలవడం, అంతా అయిపోయాక మోసపోయామని భావించి ప్రాణాలు తీసుకునే వరకు రావడం అనేది ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు. తాజాగా ఓ యువకుడు కూడా తనని పెళ్లి చేసుకోమని వివాహిత ఒత్తిడి చేయడంతో చివరికి హత్య చేశాడు. ఈ విచారకర సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బాన్సువాడ కు చెందినటువంటి ఉస్మా బేగం, అక్కడి గౌలిగూడలో నివాసం ఉంటుంది. ఈ మహిళకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి వివాహం నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
Advertisement
also read: BCCI కొత్త రూల్.. టీ20 జట్టు నుంచి సూర్య ఔట్..?
Advertisement
ఈ క్రమంలోనే యూపీకి చెందినటువంటి షెహజాద్ అనే వ్యక్తితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరు దగ్గరయ్యారు. శారీరకంగా కూడా కలవడం మొదలుపెట్టారు. ఇలా కొంతకాలం నడిచిన తర్వాత షేహజాద్ తన సొంత ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్ గజరౌలకు వెళ్లిపోయాడు. దీంతో ఉస్మాబేగం అతడు లేకపోవడంతో చాలా బాధపడింది. ఫోన్ ద్వారా సంప్రదించింది. దీంతో షెహజాద్ యూపీ కి రమ్మన్నారు. అతని మాటలను నమ్మి యూపీ వెళ్ళింది. అక్కడ కూడా ఇద్దరు శారీరకంగా కలుస్తూ ఎంజాయ్ చేశారు. దీంతో అతనితోనే జీవితమని భావించింది. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది.
కానీ అతగాడికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పెళ్లి కుదరదని చెప్పేసాడు. అయినా ఆమె వినలేదు. దీంతో అగ్రహానికి గురైన సదరు వ్యక్తి బేగాం ని తాడుతో కట్టేసి ఇటుకతో తలపై విచక్షణా రహితంగా కొట్టి చంపాడు. ఆమె చనిపోయిన తర్వాత శవాన్ని ఒక కంపెనీ పక్కన పడేసి వెళ్లిపోయాడు. దీనిపై పోలీసులకు కూడా సమాచారం అందింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. షెహజాద్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
also read: