Advertisement
వైవిధ్యబరిత చిత్రాల దర్శకుడిగా ఈవివీకి మంచి పేరుంది. ఆయన తెరకెక్కించిన ప్రేమ ఖైదీ మూవీ నుంచి మొదలుకొని అన్ని సినిమాలలో వెరైటీనే ప్రధాన అంశంగా తీసుకొని చిత్రాలు చేయడం ఆయన అలవాటు. అలా వచ్చిన చిత్రాలలో ఓ చిత్రమే ఆరుగురు పతీవ్రతలు. ఈ సినిమాని నిజజీవితంలో ఆరుగురు మహిళలకు జరిగిన సంఘటనలను బేస్ చేసుకుని చిత్రీకరించారు. ఈ సినిమా చూసిన వారికి ఇవివి సత్యనారాయణ ఎంత కష్టపడ్డారు తెలుస్తుంది. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు బాగానే గుర్తుండి ఉంటాయి.
Advertisement
Read also: ఈ 10 సినిమాలు మన దర్శకులు డైరెక్ట్ చేశారంటే అస్సలు నమ్మరుగా !
Advertisement

అమృత కెరియర్ లో అన్ని భాషలలో కలిపి కేవలం పది సినిమాలలో మాత్రమే నటించారు. అయితే అమృత ప్రస్తుతం ఏం చేస్తుందనే విషయానికి వస్తే.. సినీ పరిశ్రమకు దూరమైన అమృత ఆ తర్వాత కొంతకాలానికి తన దాంపత్య జీవితంలోకి ప్రవేశించింది. అయితే ఆ మధ్య అమెరికాలో ఏదో చేయకూడని పని చేస్తున్న విషయంలో అమృత కేసులో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ కారణం తోనే సినిమా ఇండస్ట్రీ కూడా అమృతను ఆదరించలేదని టాక్. అయితే ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు దూరమై దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అమృత బెంగుళూరులో గృహిణిగా స్థిరపడ్డట్లు తెలుస్తోంది.




