Advertisement
తెలుగు ఇండస్ట్రీలో పడి లేచిన కెరటం దర్శకుడు పూరి జగన్నాథ్. ఎన్నిసార్లు పడినా కూడా లేవడం ఈయన శైలి. ఇంకా చెప్పాలంటే జీరో అయ్యాడు అనుకున్న ప్రతిసారి హీరో అవుతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు పూరి జగన్నాథ్. రెండేళ్ల కింది వరకు పూరిని పెద్దగా పట్టించుకోలేదు మన హీరోలు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరీ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు. గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేశాడు. ఈ సినిమా విజయంతో మనోడిలో మళ్లీ జోష్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ లో మునుపటి జోరు కనిపిస్తుంది. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో పూరికి నిరాశ తప్పలేదు.
Advertisement
Advertisement
ఇక పూరి విషయం పక్కన పెడితే ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. అందరికన్నా చిన్న తమ్ముడు సాయిరామ్ శంకర్. ఇతను అందరికీ సుపరిచితమే. సాయి హీరోగా పలు సినిమాల్లో నటించాడు. ఇక బయట ప్రపంచానికి తెలియని మరో తమ్ముడు ఉమా శంకర్ గణేష్. ఈయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ విషయం బయట ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఉమాశంకర్ గణేష్ వైసిపి తరపున నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ్ముడు ఒక ఎమ్మెల్యే అని ఎక్కడా చెప్పుకోకపోవడం విశేషం. కాగా మొదట్లో ఉమా శంకర్ గణేష్ టిడిపిలో ఉండేవారు. 1995 నుంచి రాజకీయాల్లో ఉన్న ఉమా శంకర్ గణేష్, 2001 వరకు సర్పంచ్ గా, 2009 నుంచి 2012 వరకు తాండవ ఆయకట్టు సంఘానికి చైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత జగన్ సమక్షంలో వైసీపీలో చేరి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం వచ్చిన 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొందారు ఉమాశంకర్ గణేష్.
read also : ఈ 10 సినిమాలు మన దర్శకులు డైరెక్ట్ చేశారంటే అస్సలు నమ్మరుగా !