Advertisement
టాలీవుడ్ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ కృష్ణ వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు సహా సిని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ ఫ్యామిలీకి 2022 అస్సలు మర్చిపోలేని సంవత్సరం. ఓకే కుటుంబంలో ముగ్గురు ఈ సంవత్సరమే మరణించారు.
Advertisement
Read also: ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే..!!
ఈ సంవత్సరం ప్రారంభంలోనే జనవరి 8వ తేదీన వారి ఇంట్లో మొదటి విషాదం చోటు చేసుకుంది. కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబుకు అన్నయ్య అయిన రమేష్ బాబు లివర్ సంబంధిత సమస్యలతో మరణించారు. వయో సంబంధిత వ్యాధితో కృష్ణ భార్య ఇందిరాదేవి సెప్టెంబర్ 28వ తేదీన మరణించారు. ఈవిడ మరణం కృష్ణను మరింత కుంగదీసింది. ఇప్పుడు కృష్ణ కూడా మరణించడంతో ఒకే సంవత్సరం కుటుంబంలో ఉన్న ముగ్గురు పెద్దవాళ్లు దూరం అయినట్లు అయింది. ఈ బాధ నుంచి కోలుకోవడానికి మహేష్ బాబు కి ఆయన కుటుంబానికి చాలా కాలమే పడుతుంది.
Advertisement
1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరాలకు మొదటి సంతానంగా జన్మించారు రమేష్ బాబు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో బాలనాటుడిగా పరిచయమయ్యారు. కృష్ణ నటించిన పలు సినిమాల్లో బాల నటుడి పాత్రలను రమేష్ బాబు పోషించారు. వి.మధుసూదనారావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’ తో రమేష్ బాబు హీరోగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అపజయాలు ఎదురుకావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. 1997 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో ‘ఎన్ కౌంటర్’ చిత్రంలో రమేష్ బాబు చివరిగా కనిపించారు.
Read also: తక్కువ బడ్జెట్ తో భారీగా లాభాలు తెచ్చిన టాప్ 10 తెలుగు మూవీస్ ఇవే!