Advertisement
లాయర్ మరియు అడ్వకేట్ ఇద్దరు ఒకటేనని చాలా మంది అనుకుంటారు. కాని వారిద్దరూ ఒక్కటే అనుకుంటే పెద్ద తప్పు చేసినట్లు. అసలు లాయరు మరియు అడ్వకేట్ ల మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… లా కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచులర్ ఆఫ్ లెజిస్లేటివ్ డిగ్రీ అందుకున్న వారిని అంటారు. ఇండియాలో ఒక లాయరు లేదా లా గ్రాడ్యువేట్ న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే… వారు స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ చేసుకోవాలి. అలాగే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కూడా చేయాల్సి ఉంటుంది.
Advertisement
ఆ తరువాత వాళ్ళు ఒక అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. Llb డిగ్రీ ఉండి… బార్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వారిని అడ్వకేట్ అంటారు. లాయర్లు కేవలం న్యాయపరమైన సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతారు. కానీ వారు కోర్టులో ఒక క్లయింట్ తరుపున వాదించ లేరు. కానీ అడ్వకేట్ కోర్టులో ఒక క్లయింట్ తరఫున వాదించ గలుగుతాడు.
Advertisement
కేసును తన క్లయింట్ కు నష్టం పరిహారం ఇప్పించడం లాంటివి కూడా చేయగలుగుతాడు. అప్పుడే లా స్కూల్ నుంచి గ్రాడ్యువేట్ అవ్వడం వలన.. అడ్వకేట్ తో పోలిస్తే ఒక లాయర్ కు అనుభవం తక్కువగా ఉంటుంది. న్యాయస్థానంలో ఒక క్లయింట్ తరపున వాదించడానికి అనుభవం కావాలి. అడ్వకేట్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. అలాగే ఎన్నో కేసులను వాదించడం వలన అడ్వకేట్ కు ఎక్కువ అనుభవం ఎక్కువగా ఉంటుంది.