Advertisement
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు సృష్టించి, పలు అవార్డులు అందుకొని, అరుదైన గౌరవాన్ని అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ మల్టీ ఆర్గాన్స్ పనిచేయకపోవడంతో మంగళవారం రోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ, రాజకీయరంగం, సినీ ప్రేమికులు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. సూపర్ స్టార్ ఫ్యామిలీకి 2022 అస్సలు మర్చిపోలేని సంవత్సరం అనే చెప్పవచ్చు.
Advertisement
ఒకే కుటుంబంలో ముగ్గురు ఈ ఏడాదిలోనే మరణించడం గమనార్హం. ప్రారంభంలోనే జనవరి 8వ తేదీన వారి ఇంట్లో తొలి విషాదం చోటు చేసుకుంది. కృష్ణా పెద్ద కొడుకు, మహేష్ బాబుకి అన్నయ్య రమేష్ బాబు లివర్ సంబంధిత సమస్యలతో మరణించారు. వయో సంబంధిత వ్యాధితో కృష్ణ భార్య ఇందిరా దేవి సెప్టెంబర్ 28న మరణించారు. ఈవిడ మరణం కృష్ణను మరింత కుంగదీసింది. కృష్ణ కూడా మరణించడంతో ఓకే సంవత్సరం కుటుంబంలో ఉన్న ముగ్గురు పెద్దవాళ్ళు దూరమైనట్టు అయింది.
Advertisement
బాధ నుంచి కోలుకోవడానికి మహేష్ బాబుకి, ఆయన కుటుంబానికి చాలా కాలమే పడుతుంది. ఏదేమనప్పటికీ ఒకే ఏడాదిలో ఎనిమిది నెలల వ్యవధిలోనే ఏకంగా ముగ్గురు మృతి చెందడం మహేష్ బాబుకి, ఆయన కుటుంబ సభ్యులకు తీరని శోఖాన్ని మిగిల్చింది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడం ఘట్టమనేని కుటుంబానికి ఓ బ్యాడ్ సెంటిమెంట్ గా మారింది. మహేష్ బాబు ఈ విషాదాల నుంచి త్వరగా కోలుకోవాలని, మానసికంగా దృఢంగా నిలబడాలని సినీ ప్రముఖులతో పాటు ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు.
Read also: ఈ 10 సినిమాలు మన దర్శకులు డైరెక్ట్ చేశారంటే అస్సలు నమ్మరుగా !