Advertisement
తెలుగు ఇండస్ట్రీలో తండ్రి కృష్ణ నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. ఇప్పటికే ఆయన 26 సినిమాల్లో హీరోగా చేశారు. ప్రస్తుతం 27వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పటివరకు నటించిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బాస్టర్,ఇంకొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే మహేష్ బాబు వద్దకు వచ్చిన 10 హిట్ సినిమాలను వదులుకున్నాడు. ఆయన వదులుకున్న 10 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాల లిస్టు ఏంటో చూద్దాం.
Advertisement
యమలీల:
ALSO READ;సూపర్ స్టార్ కృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!
ఎస్.వి.కృష్ణారెడ్డి డైరెక్షన్లో వచ్చిన సినిమా యమలీల. ఈ స్టోరీని ముందుగా కృష్ణ కు వినిపించినప్పుడు ఇంప్రెస్ అయిన కృష్ణ ఈ సినిమాతో మహేష్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నాడు. కానీ మహేష్ బాబు చదువు డిస్ట్రబ్ చేయకూడదని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో ఈ సినిమా ఆలీ చేసి సూపర్ హిట్ కొట్టాడు.
నువ్వే కావాలి:
నువ్వే కావాలి మూవీ కూడా ముందుగా మహేష్ బాబు వద్దకు వచ్చిందట. ఈ సినిమాకు సంబంధించి ఒరిజినల్ వర్షన్ సీడిని పంపారు. కానీ మహేష్ బాబు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తరుణ్ చేశారు.
ఇడియట్:
ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ రవితేజ కి చూపించే దాని కంటే ముందే నలుగురు హీరోలను కాంటాక్ట్ అయ్యారు. ఇందులో మహేష్ బాబు కూడా ఒకరు. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా రవితేజ చేసి సూపర్ హిట్ కొట్టాడు.
మనసంతా నువ్వే:
ఎమ్మెస్ రాజు మనసంతా నువ్వే కథకి మహేష్ బాబు హీరో అయితే బాగుంటుందని ముందుగా ఆయన ను సంప్రదించారట. కానీ మహేష్ బాబు డేట్స్ కుదరకపోవడంతో ఉదయ్ కిరణ్ చేశారు.
Advertisement
గజిని :
తెలుగు, తమిళ్ లో దాదాపు ఏడుగురు హీరోల చుట్టూ తిరిగిన కథ గజిని. ఈ సినిమా కోసం మహేష్ ని అడిగితే ఆ క్యారెక్టర్ చేయలేనని చెప్పేసారట.
లీడర్:
ఈ మూవీ కథను ముందుగా మహేష్ కి వినిపించినప్పుడు కథపరంగా ఓకే,కానీ ఇంకొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని సలహా ఇచ్చారట. దానికి ఒప్పుకోని శేఖర్ కమ్ముల రానాతో ఈ సినిమా చేశారు.
రుద్రమదేవి:
రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ మొదటి నుంచి మహేష్ బాబు చేయాలనుకున్నారట. కానీ ఏవో కారణాల రీత్యా చేజారి పోయింది.
అ ఆ :
త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ తో చేయాలనుకున్న కథ ఇది. మహేష్ బాబు కు కూడా నచ్చింది.కానీ డేట్స్ కుదరక వదులుకోవాల్సి వచ్చింది.
ఫిదా:
ఎప్పటినుంచో మహేష్ తో సినిమా చేయాలని ట్రై చేస్తూ ఫిదా కథని మహేష్ బాబుకి వినిపించారు శేఖర్ కమ్ముల. కానీ ఆయనకు డేట్స్ కుదరకపోవడంతో రిజెక్ట్ అయింది.
పుష్ప:
మహేష్ బాబుని డిఫరెంట్ గా చూపించాలని ఏడాది కష్టపడి సుకుమార్ రాసుకున్న కథ ఇది. కానీ ఈ గెటప్ మహేష్ బాబుకు సెట్ అవ్వదు అని క్యారెక్టర్ లో చేంజెస్ చేస్తే మూవీ చేద్దాం అనడంతో క్యాన్సిల్ అయింది.
ALSO READ; కృష్ణకు 2500 అభిమాన సంఘాలు.. చిరంజీవి ప్రెసిడెంట్‌గా కృష్ణకి ఓ అభిమాన సంఘం