Advertisement
తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా సమయంలో.. ప్రతి రోజూ మీడియా ముందు కనిపించి.. పాపులర్ అయ్యారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఇక గతంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఖమ్మం జిల్లాలో చేసిన పూజలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తనకు తాను దేవతగా ప్రకటించుకున్న ఒక మహిళ MPP చేసిన పూజల్లో ఆయన పాల్గొన్నారు. తలపై పూజా సామాగ్రి పెట్టుకొని అక్కడ, ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
Advertisement
అయితే ఈ సంఘటన మరువకముందే మరో వివాదంలో చిక్కుకున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లకు ఆయన మొక్కడం ప్రస్తుతం కాంట్రవర్సీగా మారింది. ప్రగతి భవన్ ఈ వివాదానికి వేదికైంది. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉండి కెసిఆర్ కాళ్లు మొక్కడంపై రాజకీయ నేతల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కోసమే ఆయన అలా చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. సీఎం కేసీఆర్ కాళ్ళకు శ్రీనివాసరావు మొక్కిన సన్నివేశాన్ని కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Advertisement
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారడంతో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆ వీడియో పై మండిపడ్డారు. తన ట్విట్టర్ అకౌంట్ లో వీడియోను షేర్ చేసిన ఆకునూరి మురళి, శ్రీనివాసరావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కొత్తగూడెం అసెంబ్లీ టిఆర్ఎస్ టికెట్ గురించి కదా డాక్టర్ శ్రీనివాస్ సీఎం కాళ్లు పట్టుకోవడం. మీలాంటి ఆదికారులు బ్యూరోక్రసి పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్లినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే. పదవిని దుర్వినియోగం చేస్తూ కొత్తగూడెంలో ఏదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు’ అంటూ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సీరియస్ అయ్యారు. మరి ఈ సంఘటనపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఎలా స్పందిస్తారో చూడాలి.
కొత్తగూడెం అసెంబ్లీ TRSటికెట్ గురించే కదా Dr శ్రీనివాస్ CM కాళ్ళు పట్టుకోడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే.పదవి misuse చేస్తూ కొత్తగూడెం లో ఎదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు.వీడియో👇 pic.twitter.com/VmX8DZYc5C
— Murali Akunuri (@Murali_IASretd) November 16, 2022
READ ALSO : కేసీఆర్ “చాణక్యం”..ఈటలకు డిప్యూటీ సీఎం ?