Advertisement
టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టులో వికెట్ కీపర్ గా ఉంటూ భారత క్రికెట్ కెప్టెన్ అయ్యారు. అంతేకాదు ఈయన హయాంలో వన్డే పోట్టి క్రికెట్ తో పాటు వన్డే క్రికెట్ లో మనం దేశం క్రికెట్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈయన కెప్టెన్సీలో మన దేశానికి వన్డే తో పాటు టెస్ట్ క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు దక్కాయి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పినా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.
Advertisement
ఇది ఇలా ఉండగా, ఎన్నో అంచనాలతో టీ 20 ప్రపంచకప్-2022 లో బరిలోకి దిగిన టీం ఇండియా, సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడి అవమానకర రీతిలో ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్-2024 కు ముందు భారత జట్టును ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కెప్టెన్ తో పాటు కోచ్ ను మార్చేయాలని వాదనలు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Advertisement
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని భారత క్రికెట్ డైరెక్టర్ గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ధోనీకి జట్టు బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ అనుకుంటున్నాట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ధోని జట్టుతో కలిస్తే, ద్రవిడ్ కు పని భారం తగ్గుతుంది. ద్రవిడ్ టెస్ట్, వన్డే ఫార్మాట్ లో ఆటగాళ్లను తీర్చిదిద్దడం పై దృష్టి సారిస్తే, ధోని టి20 స్పెషలిస్టులను తయారు చేసే పనిలో ఉంటాడు. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, నవంబర్ ఆఖరిలో జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
READ ALSO : అసెంబ్లీ టికెట్ కోసం కేసీఆర్ కాళ్లు పట్టుకున్నాడుగా !