• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » గర్భందాల్చిన కోడలిపై అత్తామామ విషప్రయోగం.. ఆ కుట్రే కారణమా..?

గర్భందాల్చిన కోడలిపై అత్తామామ విషప్రయోగం.. ఆ కుట్రే కారణమా..?

Published on November 25, 2022 by anji

Advertisement

సమాజంలో రోజురోజుకు దుర్మార్గుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల కనబడితే చాలు కొందరు మానవ మృగాలు… అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇక అటు.. కొంతమంది ఆడపిల్లలు పుట్టకుండా చేస్తున్నారు. ఆడపిల్ల పుడితే చంపేస్తున్నారు లేదా పుట్టకుండా చేస్తున్నారు. మగ పిల్లలే తమకు కావాలంటూ… చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. తాజాగా, ఆడపిల్లకు జన్మనిస్తుంది అనే కారణంతో అత్తమామలు కోడలిపై విషప్రయోగం చేశారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ ఇటీవల ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Advertisement

పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లాలోని సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన గాడిపర్తి వేనుతో, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడుకు చెందిన శ్రావణికి 2020 లో వివాహమైంది. 2021 లో శ్రావణి మొదటిసారి గర్భవతి అయింది. తమకు త్వరలో వారసుడు వస్తాడని వేణు తల్లిదండ్రులు ఆశగా ఉన్నారు. అలాంటి సమయంలో శ్రావణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వేణు తల్లిదండ్రులు కొంత నిరుత్సాహానికి గురైనట్లు సమాచారం. అయితే ఈసారైనా కొడుకు పుడతాడులే అని ఆశతో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇటీవల కొన్ని నెలల క్రితం శ్రావణి రెండోసారి గర్భం దాల్చింది.

Advertisement

 

అయితే ఈసారి భర్త, అత్తమామలు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. రెండోసారి కూడా అమ్మాయి పుడుతుందని తెలుసుకున్నారు. దీంతో శ్రావణి అత్తమామలు తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం. మరోసారి ఆడబిడ్డ ఇష్టం లేని అత్తమామలు మజ్జిగ, పాలల్లో విష ప్రయోగం చేశారని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా శ్రావణి రక్తంతో వాంతి చేసుకుంది. దీంతో శ్రావణి ఆరోగ్య పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న సమయంలో కోమాలోకి వెళ్లిన శ్రావణి పరిస్థితి విషమించటంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Read also: ఈ 10 సినిమాలు మన దర్శకులు డైరెక్ట్‌ చేశారంటే అస్సలు నమ్మరుగా !

Related posts:

మాటల్లో దింపి రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది..వీడియో వైరల్ అక్క బిడ్డల కోసం బావను పెళ్లి చేసుకున్న మరదలు ! లవ్‌ చేసి పెళ్లి చేసుకుంది.. కిరాణ దుకాణం నడిపిస్తూ..అంతలోనే ! భలే ఉన్నావ్ పెళ్లి చేసుకుందామా?.. టిక్ టాకర్ వలపు వల.. చిక్కిన వారు విలవిల!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd