Advertisement
ఒకప్పటి అందాల తార, కన్నడ బ్యూటీ “ప్రేమ” గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ప్రేమ ఎక్కువగా డివోషనల్ కు సంబంధించిన సినిమాలలో నటించేది. మాతృభాష కన్నడలో కెరియర్ స్టార్ట్ చేసి.. శివ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, ఉపేంద్ర, రమేష్ అరవింద్ లాంటి స్టార్ హీరోల పక్కన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో ధర్మ చక్రం మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది ప్రేమ. ఆ తర్వాత ఆమె నటించిన కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్, దేవి, దీర్ఘ సుమంగళీభవ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తర్వాత 2006లో ప్రముఖ వ్యాఖరవేత్త జీవన్ అప్పచ్చును ప్రేమ వివాహం చేసుకుంది. కానీ తన వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యల వల్ల పరస్పర అంగీకారంతో వారు విడాకులు తీసుకున్నారు.
Advertisement
Advertisement
ఇక వ్యక్తిగత కారణాలవల్ల కొన్ని ఏళ్లపాటు ఆమె నటనకు దూరమైంది. మళ్లీ 14 సంవత్సరాల తర్వాత ఇటీవలే నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన ” అనుకోని ప్రయాణం” చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ తనకి సంబంధించిన అనేక విషయాలను షేర్ చేసుకుంది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ” చిరునవ్వుతో” సినిమాలో సహాయనిటిగా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలిపింది. హీరోయిన్ గా మంచి అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో త్రివిక్రమ్ కథను అందించిన చిరునవ్వుతో సినిమాలో ఆమెకి అవకాశం వచ్చిందట. బావతో పెళ్లి వద్దనుకుని ఓ మోసగాడిని పెళ్లి చేసుకుని మోసపోయిన అమ్మాయి పాత్రలో ప్రేమ నటించింది. అయితే పాత్ర చేయడానికి కంటే ముందే ప్రేమ సంకోచించిందట.
ఇందులో మరో హీరోయిన్ ఉందా? అని ప్రశ్నించగా.. ఇందులో మీది కూడా హీరోయిన్ పాత్రేనని చెప్పి ఒప్పించారట. మూవీలోని కథ మొత్తం తన చుట్టే తిరుగుతుందని చెప్పడంతో, మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ మీద నమ్మకంతో ఆ సినిమా చేశానని తెలిపింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక తన పాత్ర సహాయ నటి పాత్రగా మారిపోయిందని.. త్రివిక్రమ్ షూటింగ్ కి ముందు ఒకలా చెప్పి, సినిమాలో తనని మరోలా చిత్రీకరించాడని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కూడా తనకి అలాంటి పాత్రలే వచ్చాయని.. త్రివిక్రమ్ తనని మోసం చేశాడని షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రేమ. త్రివిక్రమ్ వల్లే తన కెరీర్ పోయిందని తెలిపింది. ప్రేమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.