Advertisement
Jobs in AP 2022: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈనెల 18న మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో దాదాపు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీలో దాదాపు 1000 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Advertisement
BYJUS: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. బిజినెస్ డెవలప్మెంట్ ట్రైని, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.8 లక్షల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి.
Reliance Jio Infocomm Ltd: ఈ సంస్థలో మరో వంద ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1,40,000 నుంచి రూ. 5 లక్షల వేతనం ఉంటుంది. ఎంపికైన వారు విజయవాడ, పోరంకి, గుడివాడ, మచిలీపట్నం, నూజివీడులో పని చేయాల్సి ఉంటుంది.
Advertisement
JOB Mela in Andhra Pradesh 2022
Bank Of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో మరో 120 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వేతనం ఉంటుంది. వయసు 18-30 ఏళ్లు ఉండాలి.
దీంతోపాటు మరో ఏడు సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు ఏపీ, టీఎస్ లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు:
– అభ్యర్థులు ముందుగా ఈ లింకు ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
– రిజిస్టర్ చేసుకున్న వారు ఈనెల 18న ఉదయం 10 గంటలకు కేబీఎన్ కాలేజీ, 9-42-104, KT Road, opp. శ్రీనివాస మహల్, కొత్తపేట, విజయవాడ చిరునామాలు ఈనెల 19 ఉదయం 9 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 9603368324,9700092606 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.
READ ALSO : BJP పార్టీలోకి బతుకమ్మ ?