Advertisement
Namrata Shirodkar Father: నమ్రతా-మహేష్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ జోడి నమ్రతా-మహేష్ బాబు. వృత్తిపరంగా ఒకే రకానికి చెందిన ఈ దంపతులకు ప్రేమించి పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు గౌతమ్, కూతురు సితార. పెళ్లి తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్న నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ, ఎప్పటికప్పుడు మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కొడుకు గౌతమ్, కూతురు సితారకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటుంది.
Advertisement
అయితే మిస్ ఇండియా గా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నమ్రత శిరోద్కర్ కూడా మహేష్ లో ఈ గుణాలు నచ్చే ఏరి కోరి మరి పెళ్లి చేసుకుంది. తనకంటే చిన్నవాడైన మహేష్ ని వదులుకోలేక పోయిందంటే సూపర్ స్టార్ లో ఉన్న ఈ సుగుణాలే. అటు మహేష్ కి నమ్రతలో ఉన్న వినయ విధేయతలు నచ్చాయి. చిన్న పెద్దాయన తేడా లేకుండా అందరిని గౌరవిస్తుంది నమ్రత. అందుకే ఒకానొక సందర్భంలో చిరంజీవి కూడా నమ్రతా వంటి అమ్మాయి తన కూతురు అయితే ఎంత బాగుండునో అని అన్నాడు. అయితే, నమ్రత ఇంత వినయ విధేయతలతో ఉండటానికి కారణం ఆమె కుటుంబం.
Advertisement
నమ్రత పక్కా మరాఠీ అమ్మాయి. 1972 జనవరి 22న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి నితిన్ శిరోద్కర్ అప్పట్లో ఆయన క్రికెటర్. ఆయన పూర్తి పేరు నితిన్ పాండురంగ శిరోద్కర్. ముంబైకి ఆడే ఆయన దేశవాలి క్రికెట్ లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ సర్కార్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఆడేవారట. నితిన్ తన కెరీర్ లో మంచి ఫాస్ట్ బౌలర్ గా ఎదిగాడు. ప్రమాదకరమైన బౌలర్ గా చెప్పుకునేవారు. ఇక నమ్రత తల్లి విషయానికి వస్తే ఆ రోజుల్లోనే ఆమె పెద్ద మోడల్. 2000 సంవత్సరంలో వంశీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో పరిచయం కావడం మరియు అది ప్రేమగా మారడం పెళ్లి జరగడం అన్ని చకచకా జరిగిపోయాయి.
READ ALSO : DRDO JOBS : బీటెక్/డిగ్రీ అర్హతతో డీఆర్డీఓ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలిలా..