Advertisement
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకుల అంశం. సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ మోడల్ ఆయేషా ఓమర్ తో షోయబ్ డేటింగ్ చేస్తున్నారనే విషయం సానియాకి తెలియడంతోనే వారు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వార్త వైరల్ గా మారింది. సానియా మీర్జా తన చిన్ననాటి స్నేహితుడు మహ్మద్ సోహ్రాబ్ మీర్జా తో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లిని రద్దు చేసుకుంది. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
Advertisement
షోయబ్ మాలిక్ కంటే ముందే సానియా మీర్జా, హైదరాబాద్ లోని ప్రముఖ బేకరీ చైన్ యూనివరల్ యజమాని సోహ్రబ్ మీర్జాతో నిశ్చితార్థం చేసుకున్నారు. జూలై 2009లో వీరు ఉంగరాలు కూడా మార్చుకున్నారు. సానియా, సోహ్రబ్ ఏడడుగులు నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అసలు ఏమైందో ఏమో తెలియదు, కానీ నిశ్చితార్థం జరిగిన ఆరు నెలలకే ఈ జంట విడిపోయినట్టు సమాచారం. సానియాను సోహ్రబ్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కళాశాలలో కలిశాడు. ఆమె అక్కడ చదువుకునే రోజుల్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అదే కాలేజీలో కామర్స్ చదివా.డు ఆ తర్వాత యూకే లో ఎంబిఏ చదివాడు.
Advertisement
ప్రస్తుతం సానియా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారనే వార్త చక్కర్లు కొడుతున్న సమయంలోనే సానియా-సోహ్రబ్ నిశ్చితార్థం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, సానియా-షోయబ్ విడాకులు అని ఊహాగానాల మధ్య ఓ వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. త్వరలో వీరిద్దరూ కలిసి పాకిస్తాన్ టీవీలో టాక్ షో నిర్వహిస్తారని ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రకటించింది. ఇక ఈ షోకి మీర్జా మాలిక్ షో అనే పేరు కూడా పెట్టారు. అందుకు సంబంధించిన పోస్టర్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.
Read also: యాంకర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్లకు ఉపయోగించారో తెలుసా..?