Advertisement
MS ధోని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారత జట్టులో వికెట్ కీపర్ గా ఉంటూ భారత క్రికెట్ కెప్టెన్ అయ్యారు. అంతేకాదు ఈయన హయాంలో వన్డే పోట్టి క్రికెట్ తో పాటు వన్డే క్రికెట్ లో మనం దేశం క్రికెట్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈయన కెప్టెన్సీలో మన దేశానికి వన్డే తో పాటు టెస్ట్ క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు దక్కాయి. అయితే, ధోని నాయకత్వం, అతని సలహాలతో ఎంతో మంది క్రికెటర్లు స్టార్లు అయ్యారు. ఈ లిస్టు లో సామ్ కర్రాన్ కూడా ఉన్నాడు.
Advertisement
ఇక వివరాల్లోకి వెళితే, పొట్టి ఫార్మాట్ లో ఇంగ్లాండ్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2022 సూపర్ 12 లో ఐర్లాండ్ చేతుల్లో ఓడిన ఇంగ్లాండు కొంత లక్ కలిసోచ్చి సెమీస్ చేరింది. సెమీస్ లో పటిష్టమైన టీమిండియాను ఏకంగా 10 వికెట్లతో చిత్తు చేసి ఫైనల్స్ లో అడుగు పెట్టింది. అదృష్టం కొద్ది సెమీస్ కు ఆ తర్వాత కివీస్ పై విజయంతో ఫైనల్ కి వచ్చిన పాకిస్తాన్ తో తుది పోరుకు సిద్ధమైంది. అనూహ్యంగా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీ ఎగరేసుకుపోయింది.
Advertisement
అయితే, ఫైనల్స్ లో మా బౌలింగ్ సత్తా ఏంటో చూపిస్తామని రెచ్చిపోయాడు సామ్ కర్రాన్. పటిష్టమైన పాక్ బ్యాటింగ్ లైనప్ ను కుప్ప కూల్చాడు. పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్, ఫామ్ లో ఉన్న షాన్ మసూద్, నవాజ్ లను అవుటు చేసి పాక్ ను 137 పరుగులకే కట్టడి చేసి, ఇంగ్లాండ్ బ్యాటర్లకు పెద్ద పని లేకుండా చేశాడు. ఫైనల్ మ్యాచ్ ల్లో 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చిన సామ్ 3 కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. ఫైనల్స్ లోనే కాక, టోర్నీ అసాంతం ఇంగ్లాండు జట్టుకు బౌలింగ్ లో వెన్నుముకల నిలిచాడు. మార్క్ వుడ్ లాంటి మంచి బౌలర్ గాయంతో జట్టుకు దూరమైన, సామ్ మాత్రం ఇంగ్లాండ్ ను ముందుండి నడిపించాడు. శ్రీలంకతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లోను సత్తా చాటాడు. ఈ టోర్నీలో సామ్ మొత్తం 13 వికెట్లు కూల్చి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు.
కేవలం 24 ఏళ్ల ఈ యువ క్రికెటర్ కు భారీ ప్రెషర్ ను తట్టుకొని, వరల్డ్ కప్ ఫైనల్స్ లో అంత ధైర్యంగా బౌలింగ్ చేసే మెచ్యూరిటీ ధోని వల్లే వచ్చిందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఎవరిలో ఎలాంటి టాలెంట్ దాగుందో గుర్తించి దాన్ని టైం వచ్చినప్పుడు బయటికి తీయడంలో ధోని తర్వాతే ఎవరైనా, అలాగే 2018 లో ఇంగ్లాండ్ లో, 2019లో పంజాబ్ కింగ్స్ టీం లో సాధారణ ప్లేయర్ గా ఉన్న సామ్ కర్రాన్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చి, ఎక్స్ ట్రా ఆర్డినరీ ప్లేయర్ గా మారిపోయాడు. ధోని నేర్పిన పాఠాలతో ఒత్తిడిలో ఎలా బౌలింగ్ చేయాలో, పరిస్థితులకు తగ్గట్టు, బ్యాటర్ వీక్ నెస్ పై ఎలా దెబ్బ కొట్టాలనే విషయాల్లో రాటుదేలాడు. ధోని నుంచి నేర్చుకున్న విషయాలను ఈ వరల్డ్ కప్ లో తూచా తప్పకుండా అమలు చేసి సామ్, అద్భుత ఫలితాన్ని రాబట్టాడు.
Read also: యాంకర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్‌లకు ఉపయోగించారో తెలుసా..?