Advertisement
Masooda Movie Review in Telugu: మళ్లీ రావా వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అందించిన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో మంచి థ్రిల్లర్ ను రుచి చూపించారు. విభిన్నమైన కథను ఎంచుకుంటూ దూసుకుపోతున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్క నిర్మించిన మూడో చిత్రం మసూద. హారర్ మూవీ గా వస్తున్న ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ మూవీ మసూద. ఇందులో హీరో హీరోయిన్లుగా తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ నటించారు.
Advertisement
Masooda Movie story: కథ మరియు వివరణ:
17 ఏళ్ల అమ్మాయి (కావ్య కళ్యాణ్ రామ్) విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు అసలేం జరిగింది? ఇదేం అర్థం కాని ఆ అమ్మాయి తల్లి (సంగీత) తెగ భయపడిపోతూ ఉంటుంది. పైగా ఆమె ఒంటరి తల్లి. దాంతో తన కూతురుని ఎలా కాపాడుకోవాలో ఆ అమాయకపు తల్లికి అర్థం కాదు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య తన కూతుర్ని రక్షించుకోవడానికి పిరికివాడైనా పొరుగింటి అబ్బాయిని (తిరువీర్) సహాయం కోరుతుంది. అనంతరం ఆ పిరిగివాడు, ఆ అమాయకపు తల్లి కలిసి, ఆ వింత విచిత్రమైన అమ్మాయిని ఎలా సేవ్ చేశారు? అనేది మిగిలిన కథ.
Advertisement
మసూద గురించి ఒక్కమాటలో చెప్పాలంటే, హారర్ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే సినిమా ఇది. ముందుగా సినిమాలో మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్వెల్ కి ముందు వచ్చే కావ్య కళ్యాణ్ రామ్ పాత్రకు సంబంధించిన హారర్ సీక్వెన్స్, అలాగే కావ్య పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రల ఎమోషన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అలాగే, సంగీత-తిరువీర్ మధ్య సాగే త్రిల్లింగ్ సీన్స్ కూడా బాగున్నాయి. పైగా తల్లిగా సంగీత క్యారెక్టర్ కూడా బాగా ఎలివేట్ అయింది. ఎప్పటిలాగే ఆమె చాలా బాగా నటించింది. సంగీతతో సాగే తిరువీర్ ట్రాక్ అయితే, ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. ఇక చివరిలో సంగీత పాత్ర ద్వారా మదర్ సెంటిమెంట్ ను ఇలా కూడా చూపించవచ్చా అని దర్శకుడు సాయికిరణ్ ఆశ్చర్యపరిచాడు. మొత్తం మీద హారర్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఫుల్ గా ఉన్నాయి.
Masooda Movie Review in Telugu ప్లస్ పాయింట్స్:
మసూద కథ,
హారర్ ఎలిమెంట్స్,
ఎమోషన్ సీన్లు,
నటీనటుల నటన,
మైనస్ పాయింట్స్:
క్లాస్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ కాదు.
సీన్లు సాగదీశారు.
రేటింగ్: 2.75/5.
READ ALSO : కార్తీ ‘సర్దార్’ ఓటీటీ రిలీజ్ డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?