Advertisement
ఒకప్పటి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. చిత్రం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదట్లో వరుస విజయాలతో దూసుకెళ్లారు. తేజ డైరెక్షన్లో వచ్చినటువంటి చిత్రం మూవీ సూపర్ హిట్ అయింది. దీని తర్వాత నువ్వు నేను సినిమా కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా తేజ డైరెక్ట్ చేయడం జరిగింది. వరుస ప్రేమ కథా నేపథ్యంలో సినిమాలు చేసి విజయాలు అందుకొని టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది.
Advertisement
also read:Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 19.11.2022
కానీ ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో పాటు సినిమాలు ఫ్లాపులు కావడంతో 2014 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?దానికి కారణాలేంటో?ఇప్పటికి ఎవరికి తెలియదు. కొంతమంది సినిమా అవకాశాలు తగ్గి చేసుకున్నాడు అంటే, మరి కొంతమంది సినిమాలు సరిగ్గా ఆడటం లేదని కెరియర్ డౌన్ అయిపోయిందని దీనివల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని అంటారు.. కొంతమందేమో దీని వెనకాల ఎవరి హస్తమో ఉందని చెప్పేసి కూడా మాట్లాడతారు..
Advertisement
కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ ఆయన ఆత్మహత్య గురించి సంచలమైన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ ఏ విధంగా చనిపోయారు అనేది నాకు పూర్తిగా తెలుసనని,తను చనిపోవడానికి ముందు నాతో ఫోన్లో మాట్లాడారని అన్నారు తేజ. కానీ ఇప్పుడే ఆ విషయాలను బయట పెట్టనని, నేను చచ్చేలోపైనా ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు అనే విషయాన్ని బయట పెట్టే చనిపోతానని సంచలన కామెంట్స్ చేశారు. ఈయన ఇలా మాట్లాడంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
also read: