Advertisement
ఈ మధ్య మార్కెట్లో బోలెడు రకాల పరిమళాలు దొరుకుతున్నాయి. అద్భుతమైన పరిమళం వెదజల్లే సరైన సువాసన కోసం షాపులకు, మాల్స్ కి వెళితే అక్కడ అన్ని రకాల పరిమళాల సువాసనలు మనల్ని గందరగోళపరుస్తాయి. పర్ఫ్యూమ్, డియోడ్రెంట్ ఈ రెండింటినీ సాధారణంగా శరీర దుర్వాసనను కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. పెర్ఫ్యూమ్ వాడడం ద్వారా నలుగురిలో కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు అని చాలామంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా యువత వీటి కోసం ప్రత్యేకంగా కలెక్షన్లను కూడా ఫాలో అవుతూ ఉంటారు.
Advertisement
READ ALSO: తండ్రి మరణించిన రోజే దుఃఖంలో కూడా మరో చిన్నారికి ప్రాణం పోసిన మహేష్ బాబు
Advertisement
కాగా పర్ఫ్యూమ్, డియోడ్రెంట్ లు రెండు పరిమళాలను వెదజల్లేవే అయినప్పటికీ.. వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి అనేది చాలామందికి తెలియదు. వీటి రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎలాంటి పరిమళం అయినా సుదీర్ఘకాలం సువాసన ఉండదు. అయితే పర్ఫ్యూమ్, డియోడ్రెంట్ మధ్యలో ఉండే ప్రధాన వ్యత్యాసం పర్ఫ్యూమ్ ఎసెన్స్. అంటే వాసన గాడత. సాధారణంగా పర్ఫ్యూమ్లలో 25% వరకు ఎసెన్స్ ఉంటే.. డియో డ్రెంట్లో ఇది 1 నుంచి 2 % మాత్రమే ఉంటుంది. కాబట్టి పర్ఫ్యూమ్ వాసన డియోడ్రెంట్ కంటే అధికంగా ఉంటుంది. పర్ఫ్యూమ్ ల సువాసన సుమారు 12 గంటల వరకు ఉంటుంది. డియోడ్రెంట్ కేవలం నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది. కానీ చెమటను పీల్చుకోవడంలో డియోడ్రంట్ లు సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఇందులో ఉండే యాంటీ పెర్సిప్రెంట్ చెమటను పీల్చుకొని ఎప్పుడూ తాజా అనుభూతిని కలిగిస్తుంది. ఇది పర్ఫ్యూమ్ లో ఉండదు. ఇదిలా ఉంటే పర్ఫ్యూమ్ ని చర్మంపై నేరుగా స్ప్రే చేయడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. పర్ఫ్యూమ్ ని దగ్గర్నుంచి శరీరంపై స్ప్రే చేయకూడదు. అతిగా పర్ఫ్యూమ్ వాడితే చర్మ వ్యాధులతో పాటు ముక్కు, కళ్ళు, గొంతు నొప్పి, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వాడాల్సి వస్తే తక్కువ మోతాదులో వాడాలి. కేవలం బట్టలకు మాత్రమే అప్లై చేసుకోవాలి.