Advertisement
సాధారణంగా సినీ తారలు.. ముఖ్యంగా హీరోయిన్లు అంటే అందానికి ప్రతిరూపాలని భావిస్తాం. వెండితెరపై కనబడే కథానాయికలను చూసి ఆశ్చర్యపోతుంటాం. ఇటీవల కాలంలో గ్లామర్ మహిమ బాగా పెరిగిపోయింది. సినిమాలలో హీరోయిన్స్ గ్లామర్ ప్రదర్శనకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల కాలంలో మేకప్ లేకుండా ఉండే హీరోయిన్ల ఫోటోలను కూడా చూశాం. అయితే మన తారామణులు రీల్ లైఫ్ లో కాకుండా.. రియల్ లైఫ్ లో పెళ్లికూతురుగా ఎలా ఉంటారో చూద్దాం..
Advertisement
1) కలర్స్ స్వాతి.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన స్వాతి 2018 ఆగస్టు 30వ తేదీన వికాస్ వాసుని పెళ్లి చేసుకుంది.
2) శ్రియ శరన్.. 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించింది శ్రీయ. ఇక 2018లో ఆండ్రి కొస్చివ్ ను వివాహం చేసుకుంది.
3) స్నేహ.. 2012 మే 11న చెన్నైలో ప్రసన్న వెంకటేష్ ను పెళ్లి చేసుకుంది స్నేహ.
Advertisement
4) భావన మీనన్.. తెలుగులో మహాత్మా సినిమాలో నటించిన భావన మీనన్ 2018లో చిరకాల స్నేహితుడు, కన్నడ నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది ఈ కేరళ బ్యూటీ.
5) సమంత.. 2010లో ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు పరిశ్రమ లోకి అడుగుపెట్టిన సమంత.. నాగచైతన్యను 2017 లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
6) నయనతార.. లక్ష్మీ సినిమాతో తెలుగు పరిశ్రమ లోకి అడుగుపెట్టింది నయనతార. ఇక ఇటీవల దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
7) నిహారిక.. 2016 జూన్ లో ఒక మనసు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా నటిగా తెరంగట్రం చేసింది నిహారిక. ఇక ఈ అమ్మడు కూడా 2020లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది.
8) అలియా భట్.. 2022 ఏప్రిల్ 14న ముంబైలో రణబీర్ కపూర్ ని వివాహం ఆడింది.
9) కాజల్ అగర్వాల్… 2007 లో లక్ష్మీ కళ్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. ఇక 2020 లాక్ డౌన్ సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని పెళ్లాడింది.