Advertisement
భారతదేశం నలుమూలల్లో రైల్వే వ్యవస్థ అనేది విస్తరించి ఉంది. ప్రతిరోజు ఈ రైళ్లలో ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని రైళ్లు వస్తువులను చేరవేస్తూ దేశవ్యాప్తంగా రవాణా చేస్తుంది. అయితే భారతదేశంలో 1853 లో ముంబై నుంచి థానే వరకు మొదటి రైలు నడిచింది. ఇక అప్పటి నుంచి రైల్వే వ్యవస్థ ముందుకు పోతూనే ఉంది. అయితే ప్రతిరోజు ఎంతో మంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే, మనం సాధారణ రైలు ట్రాక్లను, మెట్రో రైలు ట్రాక్లను మనం చూసేఉంటాం. సాధారణ రైలు ట్రాకుల మధ్య కనిపించే రాళ్లు, మెట్రో ట్రాకుల మధ్య మాత్రం ఉండవు. దీనికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
రైలు ట్రాక్ ల మధ్య ఉన్న రాళ్లను బ్యాలస్ట్ అంటారు. ట్రాక్ లపై రైలు నడుస్తున్నప్పుడు బలమైన కంపనం, శబ్దం వస్తుంది. ట్రాక్ పై ఉన్న ఈ బ్యాలస్టులు శబ్దాన్ని తగ్గిస్తాయి. స్లీపర్స్ అని పిలిచే ట్రాక్ దిగువ కనిపించే స్ట్రిప్ ను వైబ్రేషన్ ల సమయంలో పట్టాలు పట్టుతప్పకుండా నిరోధిస్తాయి. ట్రాక్ మధ్య కనిపించే ఈ బ్యాలస్ట్ ల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. వాటి నిర్వహణ ప్రక్రియ కారణంగా రైల్వే ట్రాక్ ను బ్లాక్ చేయాల్సి వస్తుంది.
Advertisement
మెట్రో ట్రాక్ లు ఎప్పుడు చాలా బిజీగా ఉన్నందున వాటిని మళ్లీ బ్లాక్ చేయడం సాధ్యం కాదు. అందుకే బ్యాలస్ట్ లేకుండా రూపొందిస్తారు. మెట్రో ట్రాక్లు భూమిపైన లేదా భూమికి దిగువన ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రదేశాలలో బ్యాలస్ట్ ట్రాక్ నిర్వహించడం సాధ్యం కాదు. మెట్రో రైల్ లో ఫ్రీక్వెన్సీ దాదాపు 5 నిమిషాలకు ఉంటుంది. కాబట్టి ఈ ట్రాక్లను బ్లాక్ చేయడం సమస్యగా మారుతుంది. అందుకే మెట్రో ట్రాక్లను బ్యాలస్ట్ లేకుండా కాంక్రీట్ తో తయారు చేస్తారు. అయితే మెట్రో ట్రాక్ తయారీకి అయ్యే ఖర్చు కాస్త ఎక్కువే. అయినా వాటి నిర్వహణ వ్యయం చాలా తక్కువ. ఈ బ్యాలస్ట్ రహిత ట్రాకులు వైబ్రేషన్ లను గ్రహించేందుకు విభిన్న డిజైన్లను కలిగి ఉంటాయి.
READ ALSO : Masooda Movie 3 Days Collections : మసూదకు భారీ ఆదరణ..3వ రోజు కలెక్షన్ల సునామీ !