Advertisement
పెళ్లి అనేది ఎన్నో ఏళ్ల బంధం. ఒక్కసారి ముడి పడితే నిండు నూరేళ్లు కలిసి ఉండాలి. అయితే ఈ వివాహాలు చేసుకునే సమయంలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఏజ్, కులం అనే తేడా లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇందులో క్రికెటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లను పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్లు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మన్ సూర్ అలీ ఖాన్ పటౌడి – షర్మిల ఠాగూర్
మన్ సూర్ అలీ ఖాన్ పటౌడి, షర్మిల ఠాగూర్ ఒకప్పటి భారత టెస్టు క్రికెట్ జట్టులో టైగర్ పటౌడి ఓ యువ క్రికెటర్. 1965 లో దిల్లీ వేదికగా జరిగిన ఓ పార్టీలో హీరోయిన్ షర్మిల ఠాగూర్, టైగర్ పటౌడి కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది పెళ్లికి దారితీసింది. వీరిద్దరివి వేర్వేరు మతాలైన కారణంగా వీరి వివాహాన్ని అనేకమంది తప్పుపట్టారు. ఇలాంటి పరిస్థితుల మధ్య 1969 లో వివాహ బంధంతో వీరిద్దరూ ఒకటయ్యారు.
అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ
నాలుగేళ్ల ప్రేమాయణం తర్వాత 2017 డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్నారు. విరుష్క జోడి.
Advertisement
హార్దిక్ పాండ్యా – నటాషా స్టాన్కోవిక్
పాండ్యా వల్లనే లైమ్ లైట్ టైం దక్కించుకుంది నటాషా. వీరి బంధం పెళ్లి వరకు వెళ్లకపోయినా నిశ్చితార్థం ముగించుకొని ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారు.
సంగీత – అజారుద్దీన్
1980 మిస్ ఇండియా అయిన సంగీత జిజిలాని తో చాలా కాలం డేటింగ్ చేసిన తర్వాత అజారుద్దీన్ 1996లో పెళ్లి చేసుకున్నాడు.
జహీర్ ఖాన్ – సాగరిక
బాలీవుడ్ నటి సాగరిక జహీర్ తో ప్రేమలో ఉండి సినిమాల్లో కనిపించింది. కానీ, ఆ తర్వాత తనకు తానే సినిమాల్లో నుంచి తప్పుకుంది. జహీర్ కూడా టీవీల్లో రాణించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
యువరాజ్ – హేజేల్ కీచు
సల్మాన్ ఖాన్ సినిమా బాడీగార్డ్ లో కనిపించిన హేజేల్ యువరాజ్ ను పెళ్ళాడి సినిమాలకు దూరం అయింది.
హర్భజన్ – గీతా బస్రా
ఇమ్రాన్ హష్మీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గీత, నాలుగు సినిమాలు మాత్రమే చేసింది. హర్భజన్ తో పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ రాణించేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేక పోయింది.
Read also: యాంకర్ సుమ ఇంటిని ఏయే సినిమాల షూటింగ్లకు ఉపయోగించారో తెలుసా..?