Advertisement
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ఈ విషయంపై తరచూ విమర్శల దాడి చేస్తుంటాయి. అయినా ఆయన తీరులో మార్పు లేదని అంటుంటారు నేతలు. ఇటు జగన్ బయటకు వచ్చినా చాటుగానే వచ్చి పోతున్నారనే విమర్శలు చేస్తున్నారు. నరసాపురం పర్యటన సందర్భంగా పరదాలు, బారికేడ్లను అడ్డు పెట్టడం వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలు జగన్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నాయి.
Advertisement
పాదయాత్ర సమయంలో జనానికి బాగా దగ్గరగా వెళ్లారు జగన్. ఆ తర్వాత ఆ స్థాయిలో ఆయన అలా తిరిగింది తక్కువే. జిల్లాల పర్యటనకు వెళ్లినా ఎవరికీ కనిపించకుండా కారులోనే సభ దగ్గర వెళ్తున్నారు. తాజాగా నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా పరదాలు అడ్డుగా ఏర్పాటు చేయడంపై విమర్శలు చేస్తున్నారు విపక్ష నేతలు. పైగా సభకు హాజరైన మహిళలు బ్లాక్ చున్నీలను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ముఖ్యమంత్రి జగన్ సభల సందర్భంగా పెడుతున్న ఆంక్షలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పరదాలు, బారికేడ్ల మధ్య పర్యటనలకు వెళుతున్న ముఖ్యమంత్రి… నల్లరంగులు ఉన్నాయని తన సభకు వచ్చిన మహిళల చున్నీలు కూడా తీయించివేయడం దారుణమన్నారు. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను సభలోకి రానివ్వరా? అని ప్రశ్నించారు. గొడుగులు చూసి కూడా ఎందుకు భయం అని ప్రశ్నించారు. ఇదంతా పోలీసు భద్రత కాదు.. జగన్ రెడ్డి అభద్రత అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
నిజానికి వచ్చే ఎన్నికల కోసం జిల్లాల పర్యటనలు ప్రారంభించారు జగన్. పోనీ జిల్లాల్లో అయినా ప్రజల్ని కలుస్తున్నారా అంటే అదీ లేదు. ప్రజలు దూరం నుంచి చూసి వెళ్లిపోవడమే. తన దారిలో పరదాలు కట్టేస్తున్నారు. బారీకేడ్లు పెట్టేస్తున్నారు. వందల మంది పోలీసుల్ని మోహరింపచేస్తున్నారు. ఈ తీరు చూసి జనం.. ఈయన పాదయాత్ర చేసిన జగనేనా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.