Advertisement
టీం ఇండియా.. కివీస్ పర్యటన సక్సెస్ అయింది. నేపియర్ వేదికగా జరిగిన ఇండియా, న్యూజిలాండ్ మూడవ టి20 మ్యాచ్ టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 161 పరుగుల లక్ష్యం నిర్దేశించగా, అనంతరం బరిలోకి దిగిన ఇండియా 9 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. అయితే ఆ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచును నిలిపేశారు.
Advertisement
అయితే ఈ వర్షం ఎంతకు తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం స్కోర్లు సమంగా ఉన్నందున మ్యాచ్ ను టైగా ప్రకటించారు. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే, ఫిలిప్స్ హఫ్ సెంచరీలతో న్యూజిలాండ్ కు గౌరవప్రదమైన స్కోర్ ను అందించారు.
Advertisement
నిజానికి భారీ స్కోర్ దిశగా వెళుతున్న కివీస్ ను భారత బౌలర్లు అడ్డుకున్నారు. అనంతరం 161 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా 60 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇషాన్ కిషన్(10), రిషబ్ పంత్(11), శ్రేయస్ అయ్యార్(0) లు వెంటవెంటనే అవుటయ్యారు. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా(30), దీపక్ హుడా(9) తో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే 9 ఓవర్లు ముగిసేసరికి 75/4 ఉన్నప్పుడు వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ ను నిలిపేశారు. అయితే ఈ వర్షం ఎంతకు తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం స్కోర్లు సమంగా ఉన్నందున మ్యాచ్ ను టైగా ప్రకటించారు. దీంతో భారత్ 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా నవంబర్ 25న తొలి వన్డే జరగనుంది.
READ ALSO : మల్లారెడ్డికి ఐటీ బిగ్ షాక్..లాకర్ పగలగొట్టిన అధికారులు..