Advertisement
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమలలో కూడా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది నగ్మా. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి మెప్పించింది. అప్పట్లో నగ్మా కోసమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే వారంటే అతిశయోక్తి కాదు. ఒక్క సినిమాలే కాక రాజకీయాల పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది నగ్మా. అయితే దాదాపు 5 పదుల వయసులో ఉన్న నగ్మా సినిమాలతోనే కాకుండా ఎఫైర్ వార్తలలోనూ ఎక్కువగా నిలిచేది.
Advertisement
Read also: విడాకుల వార్తలపై స్పందించిన హీరో శ్రీకాంత్!
Advertisement
టీమిండియా మాజీ రథసారథి, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో నగ్మా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. వీరిద్దరూ కలిసి తిరుపతిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని మీడియాలో సైతం వార్తలు ప్రచురించారు. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత మరో ఇద్దరితో ప్రేమాయణం సాగించినట్లు కూడా అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇలా నిత్యం ఎఫైర్ వార్తలలో నిలిచిన నగ్మా చివరకు పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా మిగిలిపోయింది. అయితే నగ్మా తన జీవితంలో అనేక ఒడిదుడుకులని ఎదుర్కొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిందని చెప్తుంటారు. ఆర్థిక ఇబ్బందులలో మునిగిపోయిన నగ్మా కుటుంబ పరిస్థితులను చక్కదిద్దడానికి 13 ఏళ్లకే హీరోయిన్ గా మారింది అనే సంగతి ఎవరికీ తెలియదు.
తనకి 13 ఏళ్ల వయసులోనే వారి తల్లిదండ్రులు హార్మోన్ ఇంజక్షన్స్ ఇప్పించారట. ఆ తర్వాత నగ్మాకు బాగీ: ఎ రేబల్ ఆఫ్ లవ్ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు హిట్ చిత్రాలలో నటించింది. అలా చిన్న వయసులోనే హార్మోన్స్ ఎక్కించడం వల్ల ఆమె శరీరంలో మార్పులు చోటుచేసుకుని సినిమాలకు సరిపోయే విధంగా తయారైందని, ఇప్పుడు దాని కారణంగానే నగ్మా గుర్తుపట్టలేని విధంగా తయారైందని మాట్లాడుకుంటున్నారు. ఇక నగ్మా ప్రస్తుతం రాజకీయాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటుంది.
Also Read: మహేష్ బాబుని కాదని కృష్ణ నరేష్ తో ఉండడానికి గల కారణం ఇదే !