Advertisement
వైసీపీ సర్కార్ తో చిరంజీవికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇది జగన్ వర్గం వాదన. దానికి కారణం లేకపోలేదు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెద్ద సమస్యగా మారారు. చిరంజీవి తమవైపే ఉన్నారని వైసీపీ వర్గాలు ఒకానొక సమయంలో కలరింగ్ ఇచ్చాయి. కానీ, సడెన్ గా సీన్ మారింది. చిరంజీవి పేరెత్తేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు.
Advertisement
మెగాస్టార్ కు కేంద్రం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డ్ ప్రకటించింది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ నేతలు వరుసగా క్యూ కట్టారు. చిరుని విష్ చేస్తూ తెగ పొగిడేశారు. వారిలో ప్రధాని మోడీ కూడా ఉన్నారు. మెగాస్టార్ నటనకు తాను కూడా ఫ్యాన్ అనే అర్థం వచ్చేలా ప్రశంసల వర్షం కురిపించారు. దీని వెనుక రాజకీయ కోణం ఉందన్న వాదన జరుగుతోంది. చిరంజీవిని బీజేపీ దగ్గరకు తీసుకుంటోందనే ప్రచారం మొదలైంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆశాభావంతో ఉన్న బీజేపీకి చిరు ప్లస్ అవుతారనే ఉద్దేశంతోనే ఇలా పొగడ్తలు కురిపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
Advertisement
ఇక మెగాస్టార్ కు విషెస్ చెప్పినవారిలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నారు. చివరికి మోహన్ బాబు కూడా కంగ్రాట్స్ చెప్పారు. కానీ, పవన్ ను దెబ్బ తీయాలని చిరు తమవాడే అనేలా ప్రచారం చేసుకున్న వైసీపీ పెద్దలు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. సీఎం జగన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కంగ్రాట్స్ చెప్పింది లేదు. ఒకరిద్దరు మినహా అందరూ గప్ చుప్. ఇదే అనేక అనుమానాలకు తావిస్తోంది. చిరుని జగన్ టార్గెట్ చేశారా? అనే డౌట్ తెరపైకి వస్తోంది.
ఈమధ్య పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు చిరంజీవి. జనసేనాని ఉన్నత స్థానానికి వెళ్తారని.. ఆ నమ్మకం ఉందని ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ వైసీపీ పెద్దలకు నచ్చకే.. కావాలనే లైట్ తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. పైగా ఇదే టైమ్ లో వైసీపీ వర్గాలకు చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో మెగాస్టార్ కి వ్యతిరేకంగా ప్రచారం మొదలైందనే వార్తలు వస్తున్నాయి. పవన్ ను పొగడడం వల్లే చిరంజీవిని విమర్శిస్తూ గతంలో మాట్లాడిన వీడియోలను త్రో బ్యాక్ పేరుతో మళ్లీ పైకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారట.