Advertisement
మన నిత్య జీవితంలో బ్లేడ్ కూడా ఓ భాగమైపోయింది. మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు కచ్చితంగా బ్లేడ్ అవసరం ఉంటుంది. అయితే… మనం పుట్టిన ప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఆకారంలో ఉంది ఈ బ్లేడ్. ఇంత వరకు దానికి ఆకారం గానీ, పరిమాణం కానీ పెరగలేదు. తగ్గలేదు. అయితే.. అలా ఎలా జరిగిందనే దానిపై ఇవాళ ఆసక్తి కర విషయాలు తెలుసుకుందాం.
Advertisement
బ్లేడ్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది జిల్లెట్ కంపెనీ. నిజానికి బ్లేడ్స్ ను తొలిసారి రూపొందించింది ఇదే కంపెనీ. 1901 లో తొలిసారి జిల్లెట్ కంపెనీ బ్లేడ్ ను తయారు చేసింది. అయితే అప్పుడు బ్లేడ్ ప్రస్తుతం ఉన్న ఆకారంలో కాకుండా, మూడు హోల్స్ తో రేజర్ లో కదలకుండా ఫిట్ గా ఉండేలా రూపొందించారు. జిల్లెట్ ఈ డిజైన్ మీద పేటెంట్ తీసుకోవడంతో 20 ఏళ్ల పాటు జిల్లెట్ డిజైన్ లో ఎవరు బ్లేడ్లను తయారు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక 20 ఏళ్ల తర్వాత 1921లో పేటెంట్ ముగియడంతో చాలా కంపెనీలు బ్లేడ్స్ ను తయారు చేయడం ప్రారంభించాయి.
Advertisement
అదే సమయంలో జె హేన్రి అనే పారిశ్రామికవేత్త ప్రోబ్యాక్ పేరుతో రేజర్ల తయారీని ప్రారంభించాడు. అయితే హేన్రి తయారు చేసే బ్లేడ్స్ పై అప్పటివరకు ఉన్న మోడల్ కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజైన్ ను తయారు చేశాడు. దీంతో ప్రో బ్యాక్ కంపెనీకి చెందిన బ్లేడ్స్, జిల్లేట్ కు చెందిన రేజర్లలో సరిపోయేవి. కానీ జిల్లేట్ కంపెనీ బ్లేడ్స్ ప్రో బ్యాక్ రేజర్ లో సరిపోయేవి కావు. దీంతో ప్రో బ్యాక్ కంపెనీ రేజర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. దీంతో జిల్లేట్ కంపెనీకి నష్టం వచ్చింది. కాలక్రమేనా అన్ని కంపెనీలు ప్రో బ్యాక్ డిజైన్ ను ఫాలో అవుతూ వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఈ డిజైన్స్ స్థిరపడింది.
Read also: యాంకర్ సుమక్క అసలు వయస్సు ఎంతో తెలుసా ?