Advertisement
ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అంతేకాదు పలు అరుదైన రికార్డులు మోగుతూనే ఉంటాయి. సెంచరీలు, వికెట్లు, పరుగులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రికార్డులు ఉంటాయి. అయితే క్రికెట్ ను ఫాలో అయ్యే చాలామందికి అసలు ప్లేయర్స్ లంచ్ బ్రేక్ లో ఏం తింటారన్న అనుమానం ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా కాస్త ఎక్కువ తింటే ఆయాసంతో అసలు ఆడలేరు. తక్కువ తింటే నీరసం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమతూలమైన ఆహారం తీసుకోవడం, మోతాదు మించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
Advertisement
లంచ్ బ్రేక్ లో ఏం తింటారు?
రెండు టీమ్స్ మ్యాచ్ లో తలపడుతున్నప్పుడు, ఆరోజు, ఆ సమయంలో ప్లేయర్స్ పోషిస్తున్న రోల్ ను బట్టి ఈ లంచ్ ఉంటుంది. ఉదాహరణకు లంచ్ బ్రేక్ సమయంలో ఇద్దరు బ్యాట్స్మెన్ క్రిజులో బ్యాటింగ్ చేస్తూ ఉంటే, వాళ్ళు ఈ బ్రేక్ లో చాలా తక్కువగా తింటారు. వికెట్ల మధ్య పరిగెత్తే సమయంలో ఆయాసం ఉండకూడదు కాబట్టి. అదే సమయంలో అలసట రాకూడదు. కాబట్టి అరటిపండు, ప్రోటీన్ బార్ వంటివి తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. లంచ్ తర్వాత బౌలింగ్ చేయబోయే బౌలర్లు కూడా ఇంతే. వాళ్లు కూడా ఇలా తక్కువ మొత్తంలో అయినా అధిక శక్తిని ఇచ్చే ఆహారాన్ని తింటారు.
Advertisement
ఇక మిగతా వాళ్ళు అంటే బ్యాటింగ్ టీం లో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న వాళ్ళు, బౌలింగ్ టీంలో కేవలం ఫీల్డింగ్ చేసేవాళ్ళు ఏదైనా తినడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకు చాలా వెరైటీల వంటకాలు ఉంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్లకు ప్రోటీన్ ఎక్కువగా ఇచ్చే చికెన్, ఫిష్ కచ్చితంగా ఉంటుంది.
ఇక శాఖాహారం ప్లేయర్స్ కోసం పప్పులు, కూరగాయలు, సలాడ్ లు అందుబాటులో ఉంటాయి. లంచ్ చివర్లో ఫ్రూట్ సలాడ్ లాంటి డెసర్ట్ కూడా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే ఐస్ క్రీములు కూడా తినొచ్చు. సాధారణంగా ఏ దేశంలో మ్యాచ్ లు జరుగుతున్న కొవ్వు తక్కువగా ఉన్న, శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్ నే లంచు లో భాగంగా ప్లేయర్స్ కు అందిస్తారు.
READ ALSO : Kantara OTT Release date : ఎట్టకేలకు ఓటీటీలో ‘కాంతార’..స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా ?