Advertisement
క్రికెట్ ఆటగాళ్లు క్రికెట్ ఆడే సమయంలో ముఖాలపై తెల్లటి పౌడర్ పూసుకోవడం మనందరం చూసే ఉంటాం. కానీ ఎందుకు పూసుకుంటారు అనే విషయం చాలామందికి తెలియదు. దీనికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్రికెటర్లు ముఖంపై పూసుకునే పౌడర్ ని జింక్ ఆక్సైడ్ అంటారు. ఇది చర్మం పైన ఉండే భౌతిక సన్ స్క్రీన్ లేదా రిఫ్లెక్టర్ అని పిలుస్తారు. ఇది సూర్యుని యొక్క హానికరమైన యువి, యువిబి కిరణాలు చర్మం నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Advertisement
ఆట ఆడే టైములో 6 గంటలు క్రికెటర్లు నేరుగా సూర్యుడి వేడికి గురవుతారు. కాబట్టి వారు జింక్ ఆక్సైడ్ ను ఉపయోగిస్తారు. అలాగే టెస్ట్ మ్యాచ్ లో ఆడే సమయంలో 5 రోజులు ఎండలో ఆడటం అంత సులువైన పని కాదు. కాబట్టి ఆటగాళ్లు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువసేపు సూర్యరశ్మీకి గురి కావడం ప్రమాదకరం. జింక్ ఆక్సైడ్ వంటి ఫిజికల్ సన్ స్క్రీన్ తో మీ చర్మాని రక్షించుకోవడం అనేది సురక్షితమైన పద్ధతి. జింక్ క్రీములు, తెల్ల రంగులో ఉన్నవి ప్రభావవంతంగా ఉంటాయి.
Advertisement
ఎందుకంటే ఈ పౌడర్ యొక్క మందపాటి పూత అన్ని యువిఏ, యువిబి కిరణాలను ఫిల్టర్ చేస్తుంది. చెవి, ముక్కును రక్షించడానికి ఉపయోగపడుతుంది. సాంప్రదాయ రసాయన లతో పోల్చినప్పుడు జింక్ ఆక్సైడ్ చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. జింక్ ఆక్సైడ్ వెంటనే పనిచేస్తుంది. కానీ కొన్ని రసాయన సన్ స్క్రీన్ లు ఎండలో బయటకు వెళ్లే ముందు ముఖానికి అప్లై చేసిన తర్వాత 20 నిమిషాలు వేచి ఉండాలని సూచిస్తున్నాయి. ఇది చాలా సున్నితమైన చర్మానికి కూడా తగినంత సున్నితంగా ఉంటుంది. రసాయన సన్ స్క్రీన్ లు, మరోవైపు, చర్మానికి ఇబ్బంది కలిగించవచ్చు. జింక్ ఆక్సైడ్ పొడి చర్మానికి చికాకు, ఇతర ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. అందుకే క్రికెటర్స్ ముఖానికి ఈ పౌడర్ రాసుకుంటారు.
READ ALSO : సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం..నెలకు లక్ష రూపాయలు జీతం !