Advertisement
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన సమంత… ప్రస్తుతం అగ్ర హీరోయిన్గా ఎదిగింది. ఈ ఛాన్స్ వచ్చినా వదులుకోకుండా అన్ని సినిమాలు చేసిన సమంత… ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉంది. అయితే గత ఆరు నెలల క్రితం తన భర్త నాగచైతన్యకు సమంత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Advertisement
అయితే నాగచైతన్యను ప్రేమించక ముందే సమంత, హీరో సిద్ధార్థ మధ్య ప్రేమాయణం నడిపింది. వీరు జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక శ్రీకాళహస్తిలో వీరిద్దరు కలిసి పూజలు కూడా చేసినట్లు అప్పట్లో కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ వీరిద్దరూ కూడా కొన్ని కారణాలవల్ల విడిపోయారు.
Advertisement
ముఖ్యంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్ల విడిపోయారని సమాచారం. సిద్ధార్థ తనకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని.. తన ఆలోచనా విధానం వేరుగా ఉందని గ్రహించిన సమంత.. సిద్ధార్థ కు దూరమైంది. ఇకపోతే సమంత తన భర్త నాగచైతన్య కు విడాకులు ఇచ్చిన తర్వాత సిద్ధార్థ సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. అంతే కాదు మోసం చేసే వారు ఎప్పటికీ సుఖంగా ఉండాలి అంటూ ట్వీట్ చేశాడు.