Advertisement
కొణిదల శివశంకర వరప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవి పేరుని ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఓ సామాన్య వ్యక్తి నుండి నటుడు, హీరో, సుప్రీం హీరో, స్టార్ హీరో నుండి మెగాస్టార్గా ఎదిగిన ఘన చరిత్ర ఈయనది. స్వయంకృషితో, పట్టుదలతో చిరంజీవి చిత్ర పరిశ్రమలో అంచలంచలుగా ఎదిగారు. కెరియర్ ప్రారంభం నుండి నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించడం, హీరో కావడానికి ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న విషయాలు మనకు తెలిసినవే. అయితే చిరంజీవి స్టార్ హీరో కావడానికి కారణమైన బ్లాక్ బస్టర్ చిత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
1) ఖైదీ.
1983లో కోదండరామిరెడ్డి – చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఖైదీ. ఈ చిత్రంతోనే చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ మొదలైంది. చిరంజీవిని అగ్ర నటుడిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి సోదరులను ప్రముఖ రచయితలుగా ఈ చిత్రం నిలిపిందనడంలో సందేహం లేదు.
2) పసివాడి ప్రాణం.
చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకున్న వాటిలో మరొక చిత్రం పసివాడి ప్రాణం. 1987లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ ను సాధించడంతోపాటు చిరంజీవిని అభిమానించే అభిమానులకు ఎంతగానో నచ్చింది.
Advertisement
3) యముడికి మొగుడు.
1988లో రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన యముడికి మొగుడు సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఆ తర్వాత కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేకవీరుడు అతిలోకసుందరి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలు చిరంజీవిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.
4) ఇంద్ర.
బి.గోపాల్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంద్ర సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసింది. ఆ తరువాత ఠాగూర్ చిత్రం చిరంజీవి తారాపదాన్ని అత్యుత్తమ స్థానానికి తీసుకువెళ్లింది. ఆ తర్వాత శంకర్ దాదా ఎంబిబిఎస్, జిందాబాద్, మురుగదాస్ దర్శకత్వంలో స్టాలిన్ చిత్రంలో నటించాడు. ఇక రాజకీయ రంగ ప్రవేశం చేసిన మెగాస్టార్.. రీఎంట్రీలో ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు.
Also Read: ఈగ సినిమాలో ఇది గమనించారా..? చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు జక్కన్నా అంటూ నెట్టింట ట్రోల్స్..!