Advertisement
‘విరాట్ కోహ్లీ’ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా చిన్న స్థాయి జీవితం నుంచి మొదలుపెట్టి ఈ రోజున భారతదేశంలోనే నెంబర్ వన్ క్రికెటర్ గా ఎదిగాడు. తన తండ్రి మరణించిన రోజే ఆటపై ఎంత ప్రేమ ఉందో చూపించాడు. దేశానికి సేవ చేయాలనుకున్నాడు. ఆరోజు ఆడిన ఒక్క మ్యాచ్ తో తన యొక్క నిబద్ధత, గొప్పతనం ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన, తండ్రికి చివరి కోరిక తీర్చడం చేసినటువంటి వ్యక్తి మన పరుగుల వీరుడు. అయితే, విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ ముందు ఫామ్ లేమీతో తెగ ఇబ్బంది పడ్డాడు.
Advertisement
సెంచరీ చేయడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఈ రన్ మెషిన్ కు. అయితే ఈ క్రమంలోనే ఆసియా కప్ లో వైఫల్యం అంతకు ముందు నుంచే పరుగులు చేయడంలో తెగ ఇబ్బంది పడుతున్న కోహ్లీని జట్టు నుంచి తప్పించి, కెరీర్ నాశనం చేసేందుకు తెగ ప్రయత్నాలు జరిగినట్లు పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన ఆరోపణలు చేశాడు. అందులో భాగంగానే కోహ్లీని టీ 20 కెప్టెన్సీ తో పాటు వన్డే కెప్టెన్సీ నుంచి మాట మాత్రం చెప్పకుండా తొలగించిన విషయం మన అందరికీ తెలిసిందే అని ఈ సందర్భంగా కనేరియా చెప్పుకొచ్చాడు. అయితే టీ 20 లో కెప్టెన్సీ నుంచి తప్పించిన గాని వన్డేలకు కెప్టెన్ గా ఉండటానికి విరాట్ ఉత్సాహం చూపినప్పటికీ అతడిని తొలగించారు. పైగా వైట్ బాల్, రెడ్ బాల్ కు వేరువేరు కెప్టెన్ ఎందుకని అప్పుడు సెలక్షన్ కమిటీ అనుకుందని కనేరియా అన్నాడు.
Advertisement
ఈ క్రమంలోనే కొహ్లీ ఫామ్ లో లేడని కొన్ని కొన్ని సిరీస్ లకు విరాట్ ను తప్పించారని గుర్తు చేశాడు కనేరియా. విరాట్ ను శాశ్వతంగా జట్టు నుంచి దూరం చేయాలని చేతన్ శర్మ సెలెక్షన్ కమిటీ భావించినట్లు ఈ పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సంచలన ఆరోపణలు చేశాడు. అయితే వీటన్నింటిని అధిగమించి ప్రస్తుతం విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు. చేతన్ శర్మ సెలక్షన్ కమిటీ చేసిన మరో తప్పిదం త్వరత్వరగా కెప్టెన్లను మార్చడం అని మండిపడ్డారు. అలాగే అర్హులైన ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పించడంలో కమిటీ విఫలం అయిందని పేర్కొన్నాడు. ఇప్పటికైనా రద్దు చేసిన కమిటీ స్థానంలో బీసీసీఐ అనుభవం ఉన్న దిగ్గజ ఆటగాళ్లను మాత్రమే కమిటీలోకి తీసుకోవాలని దానిష్ కనేరియా బీసీసీఐ కు సూచించాడు.
READ ALSO : Kantara OTT Release date : ఎట్టకేలకు ఓటీటీలో ‘కాంతార’..స్ట్రీమింగ్ ఎందులోనో తెలుసా ?