Advertisement
MS ధోని ఈ పేరు ఎవరు మర్చిపోరు. భారత జట్టులో వికెట్ కీపర్ గా ఉంటూ భారత క్రికెట్ కెప్టెన్ అయ్యారు. అంతేకాదు ఈయన హయాంలో వన్డే పోట్టి క్రికెట్ తో పాటు వన్డే క్రికెట్ లో మనం దేశం క్రికెట్ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈయన కెప్టెన్సీలో మన దేశానికి వన్డే తో పాటు టెస్ట్ క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు దక్కాయి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పినా, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఇది ఇలా ఉండగా, టి20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా పరాజయంతో భారత క్రికెట్ బోర్డులో ప్రక్షాళన మొదలైంది.
Advertisement
రోహిత్ శర్మను టి20 కెప్టెన్సీ నుంచి తప్పించి, హార్దిక్ పాండ్యా పగ్గాలు ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో, ధోని కెప్టెన్సీ పై మాజీ సెలెక్టర్ మోహిందర్ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ కంటే ముందు టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోనిని కూడా ఒకానొక సమయంలో సెలెక్టర్లు, కెప్టెన్సీ నుంచి తప్పించాలని ప్రయత్నించారట. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన ధోనిని తప్పించాలని బోర్డు సభ్యులంతా ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారట. ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు మాజీ సెలక్టర్ మోహిందర్ అమర్నాథ్, 2011లో టీమిండియా వరుస సిరీస్ లు ఓడిపోయింది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ల్లో ధోని సేన, భారీ తేడాతో చిత్తుగా ఓడింది. ధోని కూడా ఈ సిరీసుల్లో పేలవ ప్రదర్శన ఇచ్చాడు. ఈ పరాజయాలతో ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ.
Advertisement
కృష్ణమాచారి శ్రీకాంత్ చీఫ్ సెలక్టర్ గా ఉన్న సమయంలో మోహిందర్ అమర్నాథ్ సభ్యుడిగా ఉండేవాడు. ‘చీఫ్ సెలక్షన్ కమిటీ సభ్యులందరూ ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బోర్డు ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాసన్ మాత్రం మా నిర్ణయాన్ని అంగీకరించలేదు. ధోనిని కెప్టెన్ గా కొనసాగల్సిందేనని తేల్చి పడేసారు. ధోనిని ఎందుకు కెప్టెన్ గా కొనసాగాలని పట్టుబట్టాడో అందరికీ తెలుసు,’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మహీందర్ అమర్నాథ్. అయితే, ధోనిని టార్గెట్ చేసిన కొన్ని రోజులకే మోహిందర్ అమర్నాథ్, సెలక్షన్ కమిటీ నుంచి తప్పించబడ్డాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ స్థానంలో సందీప్ పాటిల్ ని చీఫ్ సెలక్టర్ గా నియమించిన బీసీసీఐ, అమర్నాథ్ స్థానంలో విక్రమ్ రాథోడ్ ని నార్త్ జోన్ సెలక్టర్ గా నియమించింది. దీనికి కారణం ఎన్ శ్రీనివాసన్ ఐపిఎల్ ఫ్రాంచైజీ సిఎస్ కె కి ధోని కెప్టెన్ గా ఉండడమేనని అందరికీ తెలిసిన విషయమే.
READ ALSO : సింగర్ మంగ్లీకి అరుదైన గౌరవం..నెలకు లక్ష రూపాయలు జీతం !