Advertisement
టీమిండియా ప్లేయర్ దినేష్ కార్తీక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఫినిషర్ గా టీ 20 ప్రపంచ కప్ 2022 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్న దినేష్ కార్తీక్, అంచనాలకు తగ్గట్టు రాణించడంలో విఫలమయ్యాడు. కీలక మ్యాచల్లో రిషబ్ పంత్ ను కాదని ఇచ్చిన అవకాశాలను అందుకోలేకపోయాడు. డీకే సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. కీలక సమయంలో క్రిజులోకి వచ్చి విఫలం అవడంతో విమర్శల వర్షం కురిసింది. దాంతో న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ కు కార్తీక్ ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
Advertisement
వన్డే ప్రపంచ కప్ 2023 సన్నాహకాల్లో భాగంగా భారత్ వచ్చే రెండు రోజుల్లో ఎక్కువగా వన్డే సిరీస్ లు ఆడనుంది. కాబట్టి దినేష్ కార్తీక్ కెరీర్ దాదాపు ముగిసినట్టే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కు డీకే గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. తాజాగా కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రపంచ కప్ 2022 లో ఆడాలన్న తన కలను నెరవేర్చుకోవడంలో సహకరించిన తోటి ఆటగాళ్లు, కోచ్లకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. దాంతో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సంకేతాలు ఇచ్చాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Advertisement
‘భారత్ తరపున టీ 20 ప్రపంచ కప్ ఆడాలనే లక్ష్యం కోసం చాలా చాలా కష్టపడ్డాను. ఇప్పుడు నా కల నెరవేరింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. టి20 ప్రపంచ 2022 టోర్ని లో మేము విజయం సాధించకపోవచ్చు. కానీ ఎన్నో జ్ఞాపకాలు నా జీవితంలో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయి. నాకు మద్దతుగా నిలిచిన నా సహచర ఆటగాళ్లు, కోచ్ లు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని వీడియోలో దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :