Advertisement
సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు ప్రజలందరిని శోకసంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు. ఆయన ఇక లేరు అనే మాటను ఇంకా ఎవరు నమ్మలేకపోతున్నారు. సాహసానికి చిరునామాగా, తెలుగు సినీ కళామాతల్లి ముద్దుబిడ్డగా, చిత్ర పరిశ్రమ మూల స్తంభాల్లో ఒకటిగా నిలిచిన, ప్రేక్షకాభిమానుల మనసులు గెలిచిన కృష్ణ మరణంతో మహేష్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. కాగా,మహేష్ బాబు తాజాగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణం మీద స్పందించాడు.
Advertisement
మీ జీవితం ఎప్పుడూ పండగలానే సాగింది, మీ అంతిమయాత్ర కూడా అలానే సాగింది, అదే మీ గొప్పదనం, ఏ భయం బెరుకు లేకుండా బతికేశారు. డేరింగ్, డాషింగ్ అనేది మీ వ్యక్తిత్వం. మీరే నాకు స్ఫూర్తి. మీరే నా ధైర్యం. అదే మీ నుంచి నేను నేర్చుకున్నాను. మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ఇప్పుడు నాలో ఉన్న ఈ ధైర్యం, బలం ఇదివరకు ఎన్నడూ నేను అనుభవించలేదు. మీ కాంతి, మీ శక్తి ఎప్పుడూ నాలోనే ఉంటుందని ఇప్పుడు నేను ఏ భయం బెరుకు లేకుండా చెప్పగలను. మీ వారసత్వాన్ని, మీ గౌరవాన్ని, మీ పరువు ప్రతిష్టలను నేను ముందుకు తీసుకెళ్తాను. నాన్నా. మీరు ఇంకా గర్వపడేలా చేస్తాను నాన్నా. లవ్ యు నాన్నా. మీరే నా సూపర్ స్టార్ అంటూ గుండెలు మెలిపెట్టేసాడు మహేష్ బాబు.
Advertisement
మహేష్ బాబు తన తండ్రి మరణించిన సమయంలో ఎంతగా ఎమోషనల్ అయ్యాడో ఆ వీడియోలన్నీ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అసలే మహేష్ బాబు ఈ ఏడాది తన అన్న రమేష్ బాబు, తల్లి ఇందిరమ్మను పోగొట్టుకున్నాడు. ఆ బాధల్లోంచి తేరుకోకముందే ఇలా నాన్నను కూడా పోగొట్టుకున్నాడు. మహేష్ బాబు ఇలా ఈ ఏడాది అంత కుంగిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇలా తండ్రి మరణించినా కూడా తన ధైర్యాన్ని మాత్రం విడనాడడం లేదు. తన తండ్రి తనలోనే ఉన్నాడు అంటూ మహేష్ బాబు చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022