Advertisement
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల సమయంలో ఈయన చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఈమధ్య మునుగోడు ఉప ఎన్నిక టైమ్ లో తెగ సందడి చేశారు. తన శక్తిమేరకు ప్రచారం చేశారు. తిరిగి అమెరికా ఫ్లైట్ ఎక్కేశారు. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న ఆయన.. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Advertisement
ఈమధ్య మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని ప్రతిపక్షాలను విమర్శిస్తూ.. పాల్ పేరు ఎత్తారు. ముఖ్యంగా పాల్, పవన్ ఒక్కటేనని వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పాల్ కు కోపం తెప్పించాయి. తాను ఎంత సైలెంట్ గా ఉన్నా వదలకుండా కవ్వింపు చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారని ఫైరయ్యారు. సీఎం జగన్ కు వార్నింగ్ ఇస్తూ.. వైసీపీ నేతల నోటికి అడ్డూ అదుపు ఉండదా? అంటూ ఫైరయ్యారు.
Advertisement
మంత్రి రోజా పందిలా తింటుందని, పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతుందో బండి సంజయ్ లాగా మాట్లాడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. వైసీపీ మంత్రులు పదే పదే తన పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. “జగన్ గారు.. మీరు మీ మంత్రులతో పిచ్చికుక్కల్లా మాట్లాడిస్తున్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఎంతగా ఫెయిల్ అయ్యారో తెలుసు. మీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి తెలుసు. మూడున్నర ఏళ్లుగా మోడీకి పాదపూజ చేసినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. రాజధానిని నిర్మించలేకపోయారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు తేలేకపోయారు. చివరికి లక్షల కోట్ల అప్పులు చేసి సమస్యని పక్కదోవ పట్టించడానికి మంత్రులతో పిచ్చికుక్కల మాదిరి మాట్లాడిస్తున్నారు’’ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు పాల్.
అంతటితో ఆగకుండా.. ‘‘రోజా అంట.. ఒక పంది లాగా తింటదేమో ఆవిడ. పిచ్చి కుక్క కరిస్తే ఎలా మాట్లాడుతుందో బండి సంజయ్ లా మాట్లాడుతుంది. లాస్ట్ వీక్ ఆ కొడాలి నాని అంట. వాడెవడో నాకు తెలియదు. మధ్యలో నా పేరు ఎందుకు తీసుకురావడం. మీకు కనీసం బుద్ధుందా” అంటూ విరుచుకుపడ్డారు కేఏ పాల్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.