Advertisement
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. త్రివిక్రమ్ అంటే అది పేరు కాదు అది ఒక బ్రాండ్. ఈయన చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మరి అంతలా పేరు సంపాదించుకున్నారు. త్రివిక్రమ్ సినిమాలన్నీ ఓ సపరేట్ స్టైల్ లో ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన పెన్ను నుంచి డైలాగులు వచ్చాయంటే అవి ట్రెండ్ సెట్టింగ్ కావాల్సిందే. ఇవన్నీ పక్కన పెడితే.. త్రివిక్రమ్ ఎంత పెద్ద హిట్ సినిమా తీసినప్పటికీ ఆ సినిమాలోని మెయిన్ లైన్ ను ఏదో ఒక పాత సినిమా నుంచి పూర్తిగా తీసుకుంటాడు అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాలలో ఉంది.
Advertisement
Read also: పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్లు వీరే..!!
త్రివిక్రమ్ సినిమాలు పాత సినిమాల లైన్లను పోలి ఉంటాయి. ఈ ఇంటర్నెట్ యుగంలో సినిమాకు సంబంధించిన కథను, సీన్లను ఎక్కడి నుంచి కాపీ కొట్టారు అనేది నిమిషాలలోనే బయటపడిపోతుంది. నితిన్ “అ ఆ” సినిమా విజయనిర్మల దర్శకత్వం వహించిన మీనా ను పోలి ఉంటుందని అప్పట్లో టాక్ వినిపించింది. ఇక వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావు సినిమాలోని సీన్లకు కూడా కొన్ని ఆంగ్ల సినీ మూలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో డైనింగ్ టేబుల్ సీన్.. ఓ హాలీవుడ్ సినిమాలో ఉంటుంది. ఇక మన్మధుడు మూవీ కి ఒక హాలీవుడ్ సినిమా మూలం అని అప్పట్లో ట్రోల్ చేశారు. ఇక త్రివిక్రమ్ కెరీర్ లో రెండవ చిత్రం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా అతడు.
Advertisement
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై సినీ నటుడు మురడి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ చిత్రంలో మెయిన్ లైన్.. ట్రైన్ లో చనిపోయిన ఓ వ్యక్తి ప్లేస్ లోకి హీరో ఆ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తాడు. ఈ లైన్ నాగార్జున హిట్ సినిమా రాముడొచ్చాడు నుంచి ప్రేరణగా తీసుకున్నాడు అనే టాక్ ప్రస్తుతం నడుస్తుంది. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1996లో వచ్చిన ఈ సినిమాలో రవళి, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో హీరో అమెరికా నుంచి ఇండియాకు వస్తాడు. అయితే పాత కక్షలతో విడిపోయిన వారి బంధువులతో పాటు గ్రామాలను కలుపుతాడు. అయితే త్రివిక్రమ్ కూడా ఈ లైన్ నుంచి స్ఫూర్తి పొందే అతడు సినిమాని డెవలప్ చేసుకున్నాడు అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాలలో ఉంది.
Also Read: అన్నంతపని చేసిన అనసూయ!