Advertisement
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో ఆయా స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరో తెలిసిపోయింది. డిసెంబర్ 1 న తొలి దశ, డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి వెళ్లి, తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.
Advertisement
భార్య కోసం రవీంద్ర జడేజా కూడా రంగంలోకి దిగారు. ఒకవైపు భార్యతో ఇంటింటి ప్రచారం చేస్తుంటే, మరోవైపు రవీంద్ర జడేజా రోడ్ షోలతో బిజీగా ఉన్నారు. బిజెపికి ఓటు వేసి, తన భార్య రివాబాను గెలిపించాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు. జామ్ నగర్ నార్త్ నియోజకవర్గంలో చాలా చోట్ల రవీంద్ర జడేజా ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. అందులో టీమిండియా జెర్సీతో రవీంద్ర జడేజా ఫోటోలు ఉన్నాయి. ఆ ఫ్లెక్సీల పై ఇప్పుడు గుజరాత్ లో దుమారం రేగుతోంది. తన భర్త క్రికెటర్ అయినంత మాత్రాన, టీమిండియా జెర్సీ ని ప్రచారంలో ఎలా వాడుకుంటారు అంటూ రివాబా జడేజాపై ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు మండిపడుతున్నారు. దీనిపై బీసీసీఐ తక్షణం స్పందించి, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
ఇండియన్ క్రికెట్ టీం ని కూడా రాజకీయాల్లోకి లాగడం సిగ్గుచేటని, ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా జెర్సీలో జడేజా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో రివాబాకు వ్యతిరేకంగా ఆమె సొంత వదినే ప్రచారం చేస్తున్నారు. రవీంద్ర జడేజా భార్యనైనా జడేజా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుగా ప్రచారం చేస్తున్న ఆమె, జామ్ నగర్ లో తన కూతురు రీవాబాను ఓడించాలని ఓటర్లను కోరుతున్నారు.
READ ALSO : సంజూకు మరోసారి అన్యాయం..సౌత్ ఇండియాకు BCCI ఛాన్స్ ఇవ్వదా ?