Advertisement
తొలి సినిమా కోసం ప్రతి కళాకారుడు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుతాడు. తెరపై కనిపించేందుకు ఏళ్ళకు ఏళ్ళు గేట్ వద్ద కాపలా కాసినవారు ఎందరో ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి ఏఎన్నార్ వరకు, నేటి హైపర్ ఆది నుంచి వెన్నెల కిషోర్ వరకు తొలి సినిమా ఛాన్స్ అంత ఈజీగా రాలేదు. వచ్చాక వారు తమ టాలెంట్ తో ఇక వెనుతిరిగి చూడలేదు. అయితే తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కొందరు ప్రముఖులు ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
# అల్లరి నరేష్:
రవిబాబు తెరకెక్కించిన అల్లరి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్. ఇప్పటికే వరుస సినిమాలతో ఇరగదీస్తున్నాడు.
# వెన్నెల కిషోర్:
2005లో వెన్నెల సినిమాతో అమెరికాలో చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చేసరికి కిషోర్.
# సిరివెన్నెల సీతారామశాస్త్రి :
సిరివెన్నెల సినిమాతో పాపులర్ అయిన సీతారాముడు అదే పేరుతో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత అదే పేరుతో 3 వేల పాటలు రాశారు.
# దిల్ రాజు:
ఎన్నో కష్టాలు పడి, డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి ఈ రోజు పాన్ ఇండియన్ నిర్మాత అయ్యారు రాజు. ఈయన సోలో తొలి సినిమా దిల్.
# షావుకారు జానకి:
Advertisement
షావుకారు సినిమా ఫ్లాప్ అయినా కూడా జానకి ఇంటి పేరు ఇదే అయిపోయింది. ఎన్టీఆర్ సరసన నటించిన తొలి హీరోయిన్ గా ఈమె రికార్డులకు ఎక్కింది. ఈమెకు 2022లో కేంద్రం పద్మశ్రీతో గౌరవించింది.
# సత్యం రాజేష్ :
తొలి సినిమా సత్యంతోనే రాజేష్ కాస్త సత్యం రాజేష్ అయిపోయాడు. ఈ సినిమాతో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు.
# శుభలేఖ సుధాకర్ :
కె విశ్వనాథ్ శుభలేఖ సినిమాతో సుధాకర్ కెరియర్ మారిపోయింది. ఇప్పటికైనా శుభలేఖ సుధాకర్ గానే ఫేమస్.
# చిత్రం శ్రీను :
చిత్రం సినిమాతో వచ్చిన శ్రీను, ఇప్పటికీ చిత్రం శ్రీను గానే గుర్తుండిపోయాడు ప్రేక్షకులకు.
# జోష్ రవి :
నాగచైతన్య జోష్ సినిమాలో నటించిన రవి, ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన అదే గుర్తింపుతో ఉన్నాడు.
# అల్లరి రవిబాబు:
అల్లరి సినిమా కేవలం నరేష్ కు మాత్రమే కాదు, దర్శకుడు రవిబాబుకు కూడా ఇంటిపేరుగా మారిపోయింది.
# ఆహుతి ప్రసాద్ :
వందల సినిమాలు చేసినా కూడా ప్రసాద్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి అహుతి ప్రసాదే.
Also Read: కార్తీకమాసంలో ఇలా చేస్తే ఎన్నో జన్మల పాపాలు పోతాయి..!