Advertisement
తెలుగు ఇండస్ట్రీ లోనే స్టార్ డైరెక్టర్ లో సుకుమారు ఒకరిగా చెప్పుకోవచ్చు. ఆయన ఏ మూవీ చేసిన ప్రతి ఒక్క సీన్ కు ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. ప్రేక్షకుల మెదళ్లను ఆలోచించేలా చేయడంలో సుకుమార్ కు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి డైరెక్టర్ సుకుమార్ ప్రేక్షకుల మెదళ్ళకు మించిన సినిమాలను చేయడంలో దిట్ట. ఆయన తెరకెక్కించిన 1 నేనొక్కడినే మూవీమేకింగ్ బాగానే ఉన్నా, జనాలకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు.
Advertisement
అయితే ఈ మూవీ తర్వాత సుకుమార్ మరి ఇంత లెవల్లో సినిమా తీయడం కరెక్ట్ కాదని భావించారో ఏమో కానీ నాన్నకు ప్రేమతో మూవీతో సినిమాను మాస్ ఆడియన్స్ మెచ్చేలా తీశారు. దీని తర్వాత రంగస్థలం సినిమాతో ఆడియన్స్ ను కట్టిపడేశారు. ఈ మూవీ టాలీవుడ్ లోనే ఒక చరిత్ర తిరగరాసింది, ఇందులో ప్రతి సీను, ప్రతి పాత్ర ఒక ప్రతి ఒక్క డైలాగ్ చరిత్రలో మిగిలి పోయేలా తీశారు సుకుమార్. ఆ మూవీలో జగతిబాబును చంపే సీన్ వెనుక పెద్ద చరిత్ర ఉంది. అది ఏంటో ఒక సారి చూద్దాం.. ఆ ఊరు ప్రెసిడెంటు చిట్టి బాబుకు భయపడి ఎక్కడో దాక్కొని ఉంటాడు. అలా దాక్కుని ఉన్న అతన్ని చిట్టిబాబు కనుక్కొని కర్రతో కొట్టి మరీ చంపుతాడు.
Advertisement
అయితే ఆ సీన్ అలా ఎందుకు పెట్టాడో సుకుమార్ వివరించారు. ఈ మూవీలో మొదటి నుంచి హీరో రామ్ చరణ్ ఒక పాము కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ దాని కుసాన్ని చూస్తాడు. ఇందులో పాముకు మరియు చిట్టిబాబుకు ఉన్నటువంటి సంబంధాన్ని చూపిస్తారు డైరెక్టర్. మనం పాము కనిపిస్తే కర్రతో కొట్టి చంపుతాం. అయితే ఇందులో కూడా చిట్టిబాబుకు ఆ ఊరి ప్రెసిడెంట్ పాము లాంటి వాడే. అందుకే ఆయన అలా ఎమోషన్స్ తో కర్రతో కొట్టి మరీ చంపేలా చూపించాడట. అయితే సుకుమార్ ఏ సీను తీసిన దానికి ఒక ఫార్ములా అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే ఆయన లెక్కల మాస్టారు అని కూడా అంటారు.
also read;
చాణక్య నీతి ప్రకారం ఈ 3 పనులు చేసుక తప్పక స్నానం చేయాలట ..! లేకుంటే ..!