Advertisement
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీకే పెద్దన్నలా మారారు మెగాస్టార్ చిరంజీవి. 1995 ఆగస్టు 22వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తన 25వ ఏట అంటే 1980లో నాటి ప్రసిద్ధ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ కాగా.. కుమారుడు రామ్ చరణ్.
Advertisement
అయితే ఆయన పెద్ద కూతురు సుస్మిత గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు చెన్నైలో స్థిరపడిన విష్ణుప్రసాద్ తో వివాహం జరిగింది. విష్ణు ప్రసాద్ కుటుంబం రాయలసీమ నుంచి వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. విష్ణు ప్రసాద్ తాతయ్య ఎల్వి రామారావు అంటే అప్పట్లో చెన్నైలో పేరు మోసిన బిజినెస్ మాన్. జపాన్, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో ఆయన వ్యాపార లావాదేవీలు నడిపేవారు. ఆయన కుమారుడు ఎల్వి ప్రసాద్ – చంద్రిక దంపతుల కుమారుడే విష్ణు ప్రసాద్. అయితే విష్ణు ప్రసాద్ బిజినెస్ రంగాలలో అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీ చేశారు. ఆయన విదేశాలలో చదువు పూర్తి చేసుకున్నాక వారి వ్యాపారాలను చూసుకోవడం మొదలుపెట్టారు. తాతయ్య ప్రారంభించిన పామాయిల్ వ్యాపారం తండ్రి సారథ్యంలో బాగా డెవలప్ అయింది.
Advertisement
అయితే విష్ణు ప్రసాద్ బాధ్యతలు చేపట్టాక ఆ వ్యాపారం కాస్త మరో రెండింతలు పెరిగింది. విష్ణు ప్రసాద్ – సుస్మిత దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. అయితే సుష్మిత ప్రస్తుతం తన భర్త ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. సుస్మిత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఓల్డ్ స్టూడెంట్. ఆమె ఫ్యాషన్ టెక్నాలజీలో చదువుకున్న చదువు ఇప్పుడు సినిమాలకు బాగా ఉపయోగపడుతుంది. ఇటీవల చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది సుస్మిత. సినీ రంగ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన సుష్మితకు ఆ రంగంపై మక్కువ ఎక్కువగా ఉంటుందని గ్రహించిన విష్ణు ప్రసాద్ భార్య సుష్మితను ప్రోత్సహించడంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.