Advertisement
ఇండస్ట్రీలోకి కొంతమంది హీరోలు అయ్యేందుకు వచ్చి నేరుగా హీరో అయిపోతే.. మరి కొంతమంది మాత్రం హీరోగా అవకాశం రావడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. దానికోసం అసిస్టెంట్ డైరెక్టర్లుగా అవతారం ఎత్తుతారు. ఇక ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఛాన్స్ రావాలంటే దాదాపు కొన్ని సినిమాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ గా నేర్చుకున్న మెలుకువలు దర్శకుడిగా మారిన తర్వాత చాలా ఉపయోగపడతాయి. ఇండస్ట్రీలో దర్శకులైన వారందరూ ఎవరో ఓ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన వారే. అలా మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి స్టార్ డైరెక్టర్ గా మారిన పదిమంది దర్శకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
1) అనిల్ రావిపూడి.
బాక్సాఫీస్ వద్ద వరుస హిట్ సినిమాలతో దూసుకు వెళ్తున్న అనిల్ రావిపూడి మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వారే. కందిరీగ, ఆగడు చిత్రాలకు అనిల్ రావిపూడి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
2) సుకుమార్.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే టాప్ డైరెక్టర్ అయిన సుకుమార్ వివి వినాయక్ “దిల్ ” చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
3) వంశీ పైడిపల్లి.
భద్ర, వర్షం, ఈశ్వర్ చిత్రాలకి వంశీ పైడిపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
4) బుచ్చిబాబు సన.
Advertisement
స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద బుచ్చిబాబు చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఉప్పెన చిత్రంతో మంచి విజయాన్ని సాధించారు.
5) హను రాఘవపూడి.
హను ఏలేటి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన హను రాఘవపూడి అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాధ వంటి చిత్రాలను తెరకెక్కించారు.
6) సుధా కొంగర.
స్టార్ డైరెక్టర్ మణిరత్నం గారి దగ్గర దాదాపు 7 సంవత్సరాలపాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు సుధా కొంగర.
7) వెంకీ కుడుముల.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ “అ ఆ” చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు వెంకీ కుడుముల.
8) నాగ్ అశ్విన్.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు నాగ్ అశ్విన్.
9) సందీప్ రెడ్డి వంగ.
కిరణ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన కేడి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు సందీప్ రెడ్డి వంగ.
10) పూరి జగన్నాథ్.
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వద్ద పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.
Read also: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సమంత పాత యాడ్స్.. అప్పుడు ఎలా ఉందో చూడండి!