Advertisement
మనం విమానాల్లో ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు అందులో ఫుడ్ ఆర్డర్ చేస్తాం. కానీ అక్కడ సర్వ్ చేసే ఫుడ్ మాత్రం అంతగా టేస్టు ఉండదు. దీనికి కారణం వారు సరిగా ప్రిపేర్ చేయరని, లేదంటే ఫుడ్డు మంచిగా పెట్టారని మనం అనుకోవచ్చు. అక్కడ కూడా మనం రెగ్యులర్ గా భూమి మీద ఉన్నప్పుడు ఏమి తింటామో, విమాన ప్రయాణంలో కూడా అలాంటి పుడ్డే మనకు పెడతారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ విమానంలో ఫుడ్డు అంతగా టేస్ట్ ఉండదు. విమానం పైన ఎగురుతున్నప్పుడు ఆకాశంలో వాతావరణం మేఘాలు, గాలులు మంచు వంటి వాటితో కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది.
Advertisement
ఇవి కూడా చదవండి : Naresh: ఆ నటితో నరేష్ నాలుగో పెళ్లి..?
వీటన్నిటినీ దాటుకొని విమానాలు 35 వేల అడుగుల ఎత్తులో ఎగురుతాయి. దీనివల్ల ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది. అంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు విమానం బయటకి మరియు విమానం లోపల ప్రెజర్ తేడా ఉంటుంది. ఆ ప్రెజర్ డిఫరెన్స్ ను తగ్గించడానికి దాన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన విమానం లోపల తేమ శాతం తగ్గిపోయి, సుమారు 20 కి పడిపోతుంది. అంటే లోపల గాలి చాలా పొడిగా ఉంటుంది. ఉదాహరణగా చెప్పాలంటే ఎడారిలో ఉండే గాలి కన్నా విమానంలో గాడి చాలా పొడిగా ఉంటుంది. ఈ విధంగా గాలి ఉండటం వల్ల మన ముక్కులోపలి నాలాలు, నాలుక కూడా పొడిబారిపోతాయి.
Advertisement
ఇవి కూడా చదవండి : ఉత్తర కొరియా అధ్యక్షుడు తన భార్యకు పెట్టిన 8 కండిషన్స్ !
దీనివల్ల నాలుకపై ఉండే టేస్ట్ బడ్స్ ఆక్టివ్ గా ఉండవు. గాలిలో తేమ లేకపోతే మనం ఫుడ్డు ను సరిగా రుచి చూడలేము . క్యాబిను ప్రెజర్ తక్కువ చేసే సమయంలో విమానంలో గాలి లెవెల్స్ కూడా తక్కువగానే ఉంటాయి. ముక్కులోపల ఉండే ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ వాసన కి రెస్పాండ్ అయ్యే స్పార్క్ తగ్గిపోవడం వల్ల మనకు టెస్ట్ తెలియదు. అందుకే మనకు జలుబు చేసినప్పుడు ఫుడ్ అంతగా టేస్ట్ గా అనిపించదు. అలాగే ఎయిర్ లైన్స్ కోసం చేసే వంటల్లో 30 శాతం ఎక్కువ షుగర్ మరియు సాల్ట్ ను కలుపుతారు. అలాగే పెద్ద పెద్ద సౌండ్లు కూడా మన రుచి గ్రంథులపై ఎఫెక్ట్ చూపిస్తాయట. అందుకే విమానాల్లో ఫుడ్డు అంతగా టేస్టు ఉండదు.
Also read: పవన్ “బద్రి” సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?