Advertisement
ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపు ఓటములపై ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా ప్రధాన పార్టీలు కొన్ని నియోజకవర్గాలను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. అక్కడ సీఎం జగన్ కు నమ్మదగిన అనుచరుడు కోడాలి నాని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ వరుసగా ఆయన గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకున్న కోడాలి మందు దేవినేని అవినాష్ నిలబడలేకపోయారు.
Advertisement
ఇవి కూడా చదవండి : 2001 కోల్కతా టెస్ట్ ఆస్ట్రేలియా తో గెలుపు లక్ష్మణ్, ద్రావిడ్ కాదు గంగూలీ ఎలాగంటే ?
భారీ మెజారిటీతో కొడాలి నాని గెలుపొందారు. అనంతరం అవినాష్ వైసీపీలో చేరారు. ఇక అప్పటి నుంచి టిడిపి నేతల కంటికి నిద్ర లేకుండా చేస్తున్నారు కోడలి నాని. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లకు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి కోడలి నానిని ఓడించాలని చంద్రబాబు టీం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.
గుడివాడలో బలమైన నాయకున్ని నిలబెట్టి, కోడాలిని కోరలు కట్ చేయాలని చూస్తోంది టిడిపి. ఈ నేపథ్యంలోనే, టిడిపికి ఓ బలమైన అభ్యర్థిగా దొరికాడట. కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే కృష్ణాజిల్లాలో కోడాలి నాని వంటి అభ్యర్థిని ఢీకొట్టాలంటే మళ్ళీ అదే సామాజిక వర్గం కావాలి.
Advertisement
ఈ నేపథ్యంలోనే, టిడిపి అధిష్టానం పలువురి పేర్లు పరిశీలిస్తుండగా అందరి దృష్టిలో గుడివాడ పట్టణానికి చెందిన అమెరికాలోని అట్లాంటా నగర ఎన్నారై, ప్రముఖ పారిశ్రామికవేత్త వెనిగండ్ల రాము పేరు తెరపైకి వచ్చింది. అంగబలం, అర్థబలంతో పాటు సౌమ్యనిగా, హడావుడి ప్రచారాలకు దూరంగా ఉండే భూరి విరాళ ప్రదాత రాము గుడివాడ రాజకీయ యువనీకపై మెరుపులా దూసుకువస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఈ టెక్ దిగ్గజం ఇప్పటికే చంద్రబాబు నాయుడుని పలుసార్లు కలిసినట్టు, చంద్రబాబు కూడా చూచాయగా మాట ఇచ్చి నియోజకవర్గంలో పనిచేయమన్నట్లు టాక్. ఇప్పటికే రాము కుటుంబ సభ్యులు గుడివాడలో చాపకింద నీరుల పనులు చక్కబెడుతున్నారు. రాము వచ్చే క్రిస్మస్ నుంచి గుడివాడ జనాలకు దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు విస్తృతం చేయనున్నారని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో నియోజకవర్గంలోనే మకాం వేసి యాక్షన్ ప్లాన్ ను రాము అమలు చేయనున్నారని సమాచారం.
read also : పంత్ ఇకనైనా కొవ్వు తగ్గించుకో.. ధోనిని చూసి నేర్చుకో !