Advertisement
వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ నుంచి విదేశీ స్టార్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. ఓ పక్క ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటేయిన్, రిలీజ్, ట్రెండింగ్, మినీ వేలం కోసం సన్నాహకాలలో బిజీగా ఉంటే, విదేశీ స్టార్లు ఒక్కొక్కరుగా లీగ్ నుంచి జారుకుంటున్నారు. అయితే, ఐపీఎల్ 2023 కు దూరం అయ్యే ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఇవి కూడా చదవండి : క్రికెట్‌ని కూడా రాజకీయం చేసేశారు…సంజూ శాంసన్ చిన్ననాటి కోచ్ సంచలన వ్యాఖ్యలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 నుంచి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తప్పుకున్నాడు. దేశం కోసం క్రికెట్ ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని కమిన్స్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. వచ్చే ఎడాది ఆస్ట్రేలియాకు అంతర్జాతీయ మ్యాచ్ లు ఎక్కువగా ఉండడంతో ఐపీఎల్ లో ఆడడం లేదని తెలిపాడు. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున కమిన్స్ ఆడుతున్న విషయం తెలిసిందే. 2021 వేలంలో కమిన్స్ భారీ ధర పలికిన విషయం తెలిసిందే. ఐపిఎల్ 2023 కి దూరంగా ఉండాలనుకోవడం కఠిన నిర్ణయమేనని ఆస్ట్రేలియా స్టార్ పెసర్, ప్యాట్ కమిన్స్ చెప్పాడు.
Advertisement
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కిరణ్ పొలార్డ్ ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010 నుంచి ముంబై ఇండియన్స్ టీం కె ఆడుతున్న అతడు, 13 సీజన్ల తర్వాత ఇక లీగ్ లో ఆడబోవనని స్పష్టం చేశాడు. ముంబై ఇండియన్స్ టీం అతన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తెలియడంతో పొలార్డ్ ఇక తప్పుకోవడం మంచిదని నిర్ణయించుకున్నాడు.
కోల్కత్తా నైట్ రైడర్స్ హిట్టర్, ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్, టెస్ట్ క్రికెట్ కే తన మొదటి ప్రాధాన్యత అంటూ లీగ్ నుంచి వైదొలగాడు. ఆసీస్ స్టార్ ఆటగాడు ఆరోన్ ఫించ్, మిచెల్ స్టార్క్ దేశ విధులే తమకు ముఖ్యమంటూ లీగ్ కు డుమ్మా కొట్టనున్నారని సమాచారం. అలెక్స్ హేల్స్.. 33 ఏళ్ల అతను ప్రపంచవ్యాప్తంగా జరిగిన టీ20 లీగ్‌లలో తన సత్తాను అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాడు. అతను అతి తక్కువ ఫార్మాట్‌లో 374 గేమ్‌లలో ఆడాడు మరియు 147.49 స్ట్రైక్ రేట్‌తో 10534 పరుగులు చేశాడు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఈ సారి ఐపీఎల్ ఆడటం లేదు హేల్స్.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ లెఫ్టార్మ్ సీమర్‌లలో మిచెల్ స్టార్క్ కూడా ఉన్నాడు. 32 ఏళ్ల అతను పేస్‌తో టాప్ బ్యాటింగ్ లైనప్‌లను కూల్చివేయడంలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. ఇతను కూడా ఈసారి ఐపీఎల్ ఆడటం లేదు.
ఇవి కూడా చదవండి : కొడాలి నానితో ఢీ : ఎవరీ వెనిగండ్ల రాము? ఆయన బలమెంతా?