Advertisement
టి20 ప్రపంచ కప్ 2020 సెమీస్ లో పోరులో టీమిండియాకు నిరాశ మిగిలింది. 15 ఏళ్ల నిరీక్షణకు తెరందించేందుకు, ఎన్నో కలలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీం ఇండియా సెమీస్ లో పోరాటం ముగించి తిరుగు పయనం అయింది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జట్టు కూర్పు పై అసంతృప్తి వ్యక్తం అయ్యాయి. ఈ ఓటమితో సీనియర్ ఆటగాళ్లయిన రోహిత్, విరాట్ కోహ్లీ తదితరులను టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారా? అనే ప్రశ్నకు కోచ్ ద్రవిడ్ సైతం ఇప్పుడే చెబితే తొందర పాటే అవుతుందని సమాధానం ఇచ్చారు.
Advertisement
అయితే తాజా నివేదికలను చూస్తుంటే త్వరలోనే రోహిత్ శర్మ, విరాట్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం 2024 టీ 20 ప్రపంచ కప్ సమయానికి సరికొత్త జట్టును సిద్ధం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. దీర్ఘకాలాన్ని దృష్టిలో ఉంచుకునే హార్దిక్ పాండ్యాను టి20 లకు కెప్టెన్ గా చేయాలని నిర్ణయించారట. అలాగే మరో ముగ్గురు ఫ్లేయర్లు అశ్విన్, షమీ, కార్తీక్ లను కూడా టీ20 నుంచి దూరం కానున్నారు.
వన్డే ప్రపంచ కప్ 2023 సన్నాహకాల్లో భాగంగా భారత్ వచ్చే రెండు రోజుల్లో ఎక్కువగా వన్డే సిరీస్ లు ఆడనుంది. కాబట్టి దినేష్ కార్తీక్ కెరీర్ దాదాపు ముగిసినట్టే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కు డీకే గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. తాజాగా కార్తీక్ పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రపంచ కప్ 2022 లో ఆడాలన్న తన కలను నెరవేర్చుకోవడంలో సహకరించిన తోటి ఆటగాళ్లు, కోచ్‌లకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. దాంతో త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సంకేతాలు ఇచ్చాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Advertisement
మహ్మద్ షమీ.. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి వన్డేలు మరియు టెస్టులు రెండింటిలోనూ భారత బౌలింగ్ అటాక్‌ను నిర్వహించాడు. అతను 2021 T20 ప్రపంచ కప్ వరకు భారత T20 సెటప్‌లో కూడా భాగమయ్యాడు. అయితే గ్లోబల్ ఈవెంట్లో పేలవమైన ప్రదర్శన తర్వాత అతను జట్టు నుండి పక్కన పెట్టబడ్డాడు. రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ ఫార్మాట్లో ఆటగాడిగా దిగ్గజం. అతను 86 టెస్టుల్లో 442 వికెట్లు పడగొట్టాడు. 26.88 సగటుతో 2931 పరుగులు చేశాడు. అతను T20 ఫార్మాట్లో కూడా కన్నీరే కస్టమర్‌గా ఉన్నాడు. ఇతను కూడా టీ20 నుంచి దూరం కానున్నాడు.